హైదరాబాద్ లోని మీర్ పెట్ రాఘవేంద్రనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది సేపటికే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్ పెట్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన నర్సిరెడ్డి అనే వ్యక్తి జిల్లేల్ గూడ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద కోవిషీల్డ్ టీకా తీసుకున్నాడు. అయితే నర్సిరెడ్డి ఇంటికి వెళ్లిన 20 నిముషాల తరువాత కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే దూరదృష్టవశాత్తు మార్గమధ్యలో చనిపోయాడు నర్సిరెడ్డి. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. టీకా వికటించి చనిపోయాడు అంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.