హైదరాబాద్‌లో భారీ వర్షం.. రేపు, ఎల్లుండి కుండపోత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో.. సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రికి ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నట్టుగా వర్షం దంచికొట్టింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వరుసగా మూడు రోజుల పాటు.. అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. వర్షాలు ఎడతెరిసి లేకుండా కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. ఇక, వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. అల్పపీడనం ప్రభావంతో రాగల 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!