ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం అంటూ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు, నర్సులకు భరోసా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా రోగులతో నేరుగా మాట్లాడారు.. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. మీకు మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ,…
‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు వారికి పరిచయం అయిన అవికా గోర్ ఏ క్షణంలోనైనా అందాల పెళ్లికూతుర్ని అయిపోటానికి సిద్ధం అంటోంది. కారణం ఆమెకు మన హైద్రాబాద్ లో దొరికిన ప్రియ మన్మథుడే! అఫ్ కోర్స్, అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాదీ ఏం కాదు. కానీ, వారిద్దరూ ఇక్కడే కలుసుకున్నారట! మిలింద్ ని చూసిన తొలి క్షణం నుంచే అవికా ఇష్టం పెంచుకుందట. తరువాతి కాలంలో ముందుగా తానే ప్రేమ సంగతి ప్రియుడితో చెప్పిందట కూడా!…
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.. ఇక, ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం.. ఉత్తర్వులు రావడం అన్ని జరిగిపోయాయి.. తాజాగా పెట్రోల్ బంక్‌లకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా పనిచేయనున్నాయి. కాగా, లాక్డౌన్ సమయంలో పెట్రోల్ బంక్‌లు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి… రైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించాలని తన లేఖలో పేర్కొన్నారు.. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బందితో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు…
సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రుల్లోని కొన్ని వార్డులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కరోనా రోగులకు ఆయన ధైర్యం చెప్పారు. కరోనా నుంచి తప్పక కోలుకుంటారని వారికి భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఉన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్…
సీఎం కేసీఆర్ తొలిసారిగా హైదరాబాద్ లోకి గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి…
సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. అనంతరం రఘురామకు వైద్య పరీక్షలపై ఓ ప్రకటన విడుదల చేశారు.. ముగ్గురు డాక్టర్ల బృందంతో రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందనీ.. పరీక్షలు మొత్తాన్ని వీడియో తీశామని పేర్కొన్నారు.. ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు మెడికల్ కేర్‌లో ఉన్నారని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి……
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు.. అసలు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది…
హైదరాబాద్ కు చెందిన ఓ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్ చేస్తోంది. డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటుంది మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి..ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తున్నది. గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్..ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా.. మరొకరు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా షాబాద్ మండలం…
కరోనా విషయంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ… రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించిన ఆమె.. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని దుయ్యబట్టారు… పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని మండిపడ్డారు. ఇక, కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించిన ఆమె..…