లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై భారీగా నమోదయ్యాయి… అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే తెలంగాణలో లక్షల వాహనాలు సీజ్ చేశారు.. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వాహనాలను కోర్టుకు సమర్పిస్తామని చెబుతున్నారు.. ఈ ఉల్లంఘనలు ఎక్కువగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.. ఇక, ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొత్తం 8.79 లక్షల కేసులు నమోదు అయినట్టు వెల్లడించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి… మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు పెట్టామని.. రూ.37.94 కోట్ల జరిమానా విధించామన్నారు.. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేశామని.. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి వాహనాలు సీజ్ చేసిన పోలీసులు.. అతిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి చిట్టాను తయారు చేశారు.. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఉల్లంఘన పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటున్నారు.. మరోవైపు.. లాక్ డౌన్ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి… అతి వేగంతో పాటుగా మద్యం తాగి ప్రమాదాలకు గురయ్యే వారి సంఖ్య పెరిగిందని డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.. మద్యం తాగి రోడ్డు ప్రమాదాలకు గురైన వారి సంఖ్య లాక్ డౌన్ లో పెరిగిపోయిందన్నారు.. లాక్ డౌన్ సమయంలో 248 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు వెల్లడించారు.. ఈ రోడ్డు ప్రమాదాల్లో నలభై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారని.. చనిపోయిన వారిలో చాలామంది మద్యం సేవించి వాహనాలు నడిపినవారేనన్నారు విజయ్ కుమార్.