పెళ్లి పేరుతో ఓ యువతిని 10 లక్షల 50 వేలు రూపాయలు మోసం చేశాడు ఓ ఘరానా మోసగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. తెలుగు మ్యాట్రిమోనీలో హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనీ లో అప్డేట్ చేసింది. అయితే మునగర్స్ మేహుల్ కుమార్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పని చేస్తున్నాను అని ఆ యువతిని మోసం చేశాడు. ప్రొఫైల్ నచ్చిందని, వివాహం చేసుకోవడానికి అంగీకారమే…
కరోనాను కట్టడి చేయడానికి మానవాళి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌ను వ్యాక్సినేషన్ కొరత వెంటాడుతోంది.. విసృత్తంగా వ్యాక్సిన్ వేయాల్సిన సమయంలో.. కొరత రావడంతో.. దానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైన భారత ప్రభుత్వం.. విదేశీ వ్యాక్సిన్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే రష్యాలో మంచి ఫలితాలను ఇచ్చిన ఈ వ్యాక్సిన్‌లో ప్రపంచంలోని ఇతర దేశాలో భారీగా కొనుగోలు చేయగా.. భారత్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.. దీంతో.. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి…
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈటల దగ్గర ఉన్న వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై… దీంతో.. ఏ శాఖలేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.. అయితే, ఈటల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ తప్పించాలని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ లేఖ రావడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గవర్నర్.. ఇక, ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. విచారణకు ఆదేశించిన సంగతి…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు… డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను వినియోగించుకునే వీలు కల్పించింది.. మిగతా టీకాలను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు.. కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్…
కరోనా సెకండ్ వేవ్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.. అది ఈ రోజుతో ముగిసిపోగా.. జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌కు వెళ్తుందేమో అనే ప్రచారం కూడా సాగింది.. మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని కొట్టిపారేసినా.. సమీక్షలు, ఉన్నతస్థాయి సమావేశాలు జరిగితే మాత్రం.. ఏదో నిర్ణయం జరుగుతుందనే గుసగుసలు వినిపించాయి. ఇక, వాటికి ఫులిస్టాప్ పెడుతూ.. నైట్ కర్ఫ్యూ ను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ అమల్లో…
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.. అయతే, నిన్న హోంశాఖమంత్రి మహమూద్ అలీ.. పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం.. లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమంటూ ప్రకటించడంతో.. ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్డౌన్ తప్పదా? అనే చర్చ మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. అసలు లాక్డౌన్ పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘అన్నాత్తే’ బృందం ఈరోజు హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. నగరంలోని ఐకియా స్టోర్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలను…
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించిందని విమర్శించారు.. దేశంలో కరోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని.. ఇప్పటికైనా మహమ్మారి కట్టడికోసం చర్య తీసుకోవాలన్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఒవైసీ..…