హైదరాబాద్ లో మరో కారు బీభత్సం సృష్టించింది. ప్రేమావతి పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకు వెళ్ళింది కారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు బలంగా ఢీ కొట్టడంతో బాలుడు ఒక్కసారిగా గాలిలో ఎగిరి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. బయట పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో నుండి రోడ్డు పైకి వచ్చిన కాలనీ వాసులు… బాలుడిని ఢీ కొట్టి పారిపోతున్న కారు డ్రైవర్ ను పట్టుకొని చితకబాదారు స్థానికులు. డ్రైవర్ మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడిపించి నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సిసిటివి కెమెరాలో రికార్డ్ అయిన ప్రమాద దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కారు లో డ్రైవర్ తో పాటు నలుగురు వున్నట్లు గుర్తించారు. కానీ బాలుడిని ఢీ కొట్టగానే కారు దిగి పారిపోయారు అందులో వున్న వారు.