తెలంగాణలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో జూన్ 23 నుంచి 10 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో జూలై 1వ తేదీ నుంచి మరో 45 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రేపటి నుంచి 55 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 45 రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.