కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వస్తుంది. ఈరోజుకు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.360 తగ్గి రూ.43,750 వద్ద ఉండగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.47,730 వద్ద ఉన్నది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి . కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.72,900కి చేరింది.