బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కొంపల్లి, కుత్భుల్లాపూర్, అంబర్పేట్ తో పాటుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టుప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తుఫాన్…
తెలంగాణ సీఎం గొప్ప సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ధరణి పోర్టల్, భూ సమస్యల పరిష్కారం డిమాండ్‌తో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అన్నింట్ల ముందంటివి.. వరి పండించడంలో రాష్ట్రం ముందంటివి.. ఇప్పుడూ వరి వేస్తే ఉరి అంటున్నావు ఏంటి? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్‌నేనని గుర్తుచేసుకున్న ఆయన.. ఫస్ట్ సాఫ్ట్వేర్ రెడీ చేసి ముందు సాధ్యాసాధ్యాలపై…
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ మూసివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అయితే.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు పండ్ల వ్యాపారులు.. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కోర్టు మెట్లెక్కారు.. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది.. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.. అంతే కాదు.. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్‌గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్ ఆదేశించినట్టు తెలుస్తుంది… ఏఐసీసీ కార్యదర్శి బోస్…
మన దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఓ రోజు పెరిగితే… ఓ తగ్గుతున్నాయి. ఇక తాజాగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 43,200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430…
ఇంటర్ మొదట సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు.. అక్టోబర్ 25 నుండి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా.. వంద శాతం సిలబస్ పూర్తిచేసే పరిస్థితి లేకపోవడంతో.. ఈ సారి 70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరుగుతున్న కొన్న ఘటనలపై స్పందించిన జగ్గారెడ్డి… పార్టీ బాగు కోసమే నేను మాట్లాడుతున్న.. రేవంత్ ఒక్కడితో అంతా అయిపోదన్నారు.. అందరినీ కలుపుకుని పోవాలని సూచించిన ఆయన.. రేవంత్ తీరుపై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. నేను మాట్లాడేది తప్పు అయితే.. రేవంత్‌రెడ్డి చేసేది కూడా తప్పే అంటున్నారు జగ్గారెడ్డి. ప్రతీ సభలో ఎవ్వరినీ ఆయన…
ఎడ్‌సెట్ 2021 ఫలితాలను విడుదల చేశారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి.. ఈ సారి ఎడ్‌సెట్‌లో 98.53 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు… ఎడ్‌సెట్‌కు 34,185 మంది విద్యార్థులు హాజరుకాగా.. మొత్తంగా బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. అందులో 25,983 మంది అమ్మాయిలే ఉండడం విశేషం.. ఈ ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇక, మొదటి ర్యాంక్ తిమ్మిశెట్టి మహేందర్ (నల్గొండ), రెండో ర్యాంక్ ప్రత్యూష (మంచిర్యాల),…
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం…
స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు కోటి రూపాయలు వసూళ్ళు చేసి ఉడాయించారు నిర్వాహకులు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను నిలువునా ముంచారు కంత్రిగాళ్లు. ఓ అప్లికేషన్ లో విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు… సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుండి 4 వేల రూపాయలు వసూళ్ళు చేసారు. స్కాలర్షిప్ ఏమి అయ్యాయి అంటూ బాధితులు నిలదీసిన…. పొంతన లేని…