అసెంబ్లీని కేవలం ఐదు రోజుల పాటే నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్న ఆయన.. మజ్లీస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్నారు.. స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఆయన.. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం.. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదన్నారు.. మొదటి ప్రభుత్వంలో…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. GHMCలో కలిపేద్దామా..? మీ అభిప్రాయం చెప్పడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై చర్చ జరుగుతోంది. సికింద్రబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై తెలంగాణ ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. దీంతో అక్కడ నివసించే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా… ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే దానిని జీహెచ్ఎంసీలో కలపాలని స్థానికులు కోరుకుంటున్నారంటున్నారు మంత్రి KTR. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి KTR కామెంట్స్‌పై హర్షం వ్యక్తం…
ఇండియాతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ల సీజన్లో పసిడికే డిమాండ్ ఎక్కువ. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 43,590 కి…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించేందుకు, అందరికీ పరిశుభ్రమైన మాంసాన్ని అందించేందుకు రాష్ట్ర పశువర్థక శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది పశువర్ధక శాఖ. రాష్ట్రంలో కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్లో ఒకటి చొప్పున వధశాలలను ఏర్పాటు చేసివాటిని…
టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరారు చెన్నమనేని తరపు న్యాయవాది వై. రామారావు.. రాష్ట్ర ప్రభుత్వo, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు భౌతికంగా వాదనలు వినిపించడానికి సుముఖం వ్యక్తం చేశారు.. ఈ కేసులో.. అనేక రకమైన అఫిడవిట్లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున.. వాదనలకు అన్ని పార్టీలు…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. హస్తినలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి…
ఈ మధ్య వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ పెరుగుతూ పోతోంది.. హైదరాబాద్ మార్కెట్లో రూ.380 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,840కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగడంతో రూ.43,850కి ఎగబాకింది.. మరోవైపు.. వెండి ధర కూడా పసిడి బాటే పట్టింది.. ఇవాళ రూ.1300 పెరగడంతో కిలో వెండి ధర రూ.65,100కు చేరింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను వారానికి పైగా నిర్వహించాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. బీఏపీ సమావేశంలో చర్చించి… ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న మొదలై.. 26న ముగిశాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దళితబంధు పథకం కోసం కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి…ఆమోదించుకోవాలని భావిస్తోంది.…
ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన తర్వాత.. సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక ఆడ, ఒక మగ అధికారులతో కమిటీ ఉంటుందని.. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించి…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఒకరిపై ఒకరు మరీ పోటీపడి ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఒక రాష్ట్రం విధానం.. మరో రాష్ట్రానికి నచ్చడంలేదు.. ఇంకో రాష్ట్రం అవలంభిస్తున్న వైఖరి పక్క రాష్ట్రం జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది.. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రాసిన లేఖలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్…