తెలంగాణలో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక, దసరా కంటే ముందు నుంచే నిర్వహించే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రత్యేకం.. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దసరాను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం.. బతుకమ్మల సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తూ వస్తోంది.. ఈ ఏడాది కూడా ఇందుకోసం 289 రకాల చీరలు సిద్ధం…
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసి నదికి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా నగరంలోని…
నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు తిగిరి తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు దిగి వస్తున్నప్పటికీ, వెండి మాత్రం పెరుగుతూనే ఉన్నది. తగ్గిన ధరల ప్రకారం నగరంలోని బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ.47,130 కి చేరింది. ఇక కిలో వెండి ధర…
ప్రజాప్రతినిధులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల రూపాయల నుంచి 13 వేల రూపాయలకు పెరిగింది.. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6500కు పెంచుతూ పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, ప్రభుత్వ…
సైబరాబాద్ కడ్తల్ లో ఓ మైనర్ బాలిక పై అత్యాచారం కు పాల్పడ్డారు. మైనర్ బాలికకు గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు. పల్లెచెల్క తాండ కు చెందిన రవీందర్ ను నిందితుడిగా గుర్తించారు. సాగర్ రింగ్ రోడ్ లో మైనర్ బాలికకు ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారు ఆర్ఏంపి డాక్టర్ రంజిత్. అయితే ప్రెగ్నెన్సీ అని తేలడంతో బాలికకు అబార్షన్ చేసారు డాక్టర్ లక్ష్మీ. అయితే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే హిమాయత్ సాగర్ చెరువు, అప్ప చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్ డీ ఓ రాజేంద్ర నగర్ చంద్రకళ, జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్ హెచ్ఏఐ తదితర శాఖల అధికారులతో కలిసి ఈరోజు స్వయంగా…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్ దగ్గర ఉన్న చిన్న…
గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై…
తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, కేసీఆర్ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు.. కేసీఆర్ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి? కేసీఆర్ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు…
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈ రోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ. 43,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160…