మావోయిస్టు కీలక నేత హరిభూషన్ భార్య సమ్మక్క అలియాస్ శారద లొంగిపోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి… 1994లో 18 ఏళ్ల వయస్సులోనే పాండవ దళంలో కమాండర్‌గా పనిచేస్తున్న హరిభూషన్… శారదను మైనర్‌గా ఉన్నప్పుడే పార్టీలోకి తీసుకెళ్లారని తెలిపారు. ఆమె కిన్నెర దళంలో 1997 నుండి 1998 వరకు పనిచేసిందని వెల్లడించిన ఆయన.. 1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ మెంబర్‌గా… ప్లాటున్ మెంబర్‌గా పనిచేశారన్నారు.. 2008లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయిన…
హైదరాబాద్‌లో వరుసగా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూ కలవరపెడుతున్నాయి… తాజాగా, ఓల్డ్‌సిటీలో మరో ఘటన బయటపడింది.. తమ్ముడి భార్యపై కన్నేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తి.. ఆమెను లోబర్చుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు.. విషయం పోలీసులకు గానీ, బయట ఎవ్వరికి చెప్పినా చంపేస్తానంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేశాడు.. అంతేకాదు.. పలుమార్లు దాడులు కూడా చేసినట్టు బాధిత మహిళ చెబుతోంది.. మూడు నెలలపాటు ఇర్ఫాన్ చిత్రహింసలను మౌనంగా బరించిన ఆ మహిళ.. చివరకు కుటుంబపెద్దల సహకారంతో.. భరోసా…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు.. పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.. కొన్ని చోట్ల భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడిప్పుడే కాస్త తెరపి ఇస్తుండా.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్సాలు ఒకటి, రెండు చోట్ల.. ఎల్లుండి కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ కేంద్రం.. ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన…
కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. గాంధీ భవన్లో జెండా ఎగరేసిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి అప్పటి ప్రధాని నెహ్రూ సహకరించారని తెలిపారు.. హోంమంత్రికి ప్రత్యేక నిర్ణయాలు ఉండవు.. ఆపరేషన్ పోలో నిర్ణయం నెహ్రూదేనని స్పష్టం చేశారు.. కానీ, కొందరు ఇది హోం మంత్రి నిర్ణయంగా చిత్రీకరిస్తున్నారన్న ఆయన.. కాంగ్రెస్ పూర్వీకుల…
హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… నిందితుడూ ఎంతకీ దొరకకపోవడంతో.. పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు.. అన్ని జిల్లాలలను అప్రమత్తం చేశారు.. నిందితుడి చిత్రాలతో పాటు, ఊహా చిత్రాలను కూడా విడుదల చేసి అలర్ట్ చేశారు.. ఇక, నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండడంతో.. మద్యం షాపుల నిర్వహకులకు కూడా నిందితుడి ఫొటోలు పంపించి అలర్ట్ చేశారు.. అయితే, నిందితుడు రాజు పోలీసులకు చిక్కుండానే రైలు…
తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ విలీనమా..? విమోచనమా? అనే చర్చ సాగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుంటే.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం విమోచన దినంగా పాటిస్తోంది.. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన గవర్నర్ తమిళిసై.. “సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు…
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. మున్సిపాలిటీ పరిధిలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైరింజన్ల సమాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. అయితే, గోదాంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీల సహాయంతో గోడలు కూల్చివేస్తున్నారు అధికారులు.. గోదాంలో పిచికారీ మందులు మరియు సీడ్స్ ఉన్నట్లుగా…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరిగాఇంది.. మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం దాదాపు ఆరుగంటల పాటు సాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది. మొదటగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేబినెట్ లో చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలల్లో…
ఢిల్లీ పర్యటనలో ఉన్న త్రిదండి చిన్న జీయర్ స్వామి.. వరుసగా కేంద్రం పెద్దలను కలుస్తున్నారు.. బుధవారం రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రావాలంటూ ఆహ్వానించిన ఆయన.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.. శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.. ఈ సందర్భంగా గంటకుపైగా అమిత్‌షాతో చర్చలు జరిపారు.. చిన్నజీయర్ తో పాటు…
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,261 శాంపిల్స్ పరీక్షించగా.. 259 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్‌బారినపడి మృతిచెందగా.. 301 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,785కు చేరగా.. రికవరీ కేసులు 6,53,603కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,900 మంది ప్రాణాలు…