తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అంతా సీఎం కేసీఆర్ చలువ వల్లనేనన్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్. హైదరాబాద్ రామంతపూర్ లో జరిగిన ఎస్.ఎన్. ఎస్. డెవలపర్స్ నూతన వెంచర్ బ్రోచర్ ను నటుడు సుమన్ విడుదల చేశారు. యాదగిరిగుట్ట సమీపంలోని రాజపేట లో 50 ఎకరాలలో తమ ఆరవ వెంచర్ ఏర్పాటు చేస్తున్నామని, యాదాద్రి- కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న తమ వెంచర్ ఉంటుందని కస్టమర్లకు అన్నిరకాల సదుపాయాలతో తమ వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్.ఎన్.ఎస్. డెవలపర్స్ ఎం.డి. శ్రీకాంత్ రెడ్డి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.