సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై ఈ నెల 18న బ్యాంకు అధికారులతో భేటీ అయ్యారు ఏపీ అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి.. ఈ నెల 21 న కార్వాన్ యూబీఐ బ్యాంక్ నుండి రూ.24 కోట్లు విత్ డ్రా కు రఫిక్ అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని పంపించారు.. అయితే, మస్తాన్‌వలి అనుచరుడిగా రఫీక్ తో పరిచయం చేసుకున్నాడు రాజ్‌కుమార్.. అతడికి ఎఫ్‌డీఐలను ఇవ్వాలని చెప్పారు రఫిక్.. అంతేకాదు.. మస్తాన్ వలీ, రాజ్‌కుమార్‌తో చాలా వరకు రఫిక్ టచ్‌లో ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.. అయితే, ఎఫ్‌డీలు క్లోజ్ చేయడానికి సమయం కోరారు యూబీఐ మేనేజర్ మస్తాన్‌వలి.. అర్ధ సంవత్సరం కావడంతో ఎఫ్‌డీల క్లోజింగ్ కొరకు సమయం ఇవ్వాలని కోరారు.. ఇక, మూడు రోజులైనా మస్తాన్‌వలీ స్పందించలేదు.. దీంతో.. 24న బ్యాంక్ కి మళ్లీ రఫిక్‌ని పంపించారు డైరెక్టర్.. యూబీఐ కార్వాన్ బ్రాంచ్‌లో ఉన్న అన్ని ఎఫ్‌డీలు క్లోజ్ అయినట్లు రఫిక్ తెలుసుకున్నారు.
కాగా, యూబీఐ కార్వాన్‌లో తెలుగు అకాడమీ రూ.43 కోట్లు ఎఫ్‌డీలను వివిధ సమయాల్లో చెల్లించింది.. 18 కోట్ల రూపాయలకు సంబంధించి తెలుగు అకాడమీ వద్ద రషీదులు ఉన్నాయి.. ఇక, కొన్ని నెలల కిందటే సంతోష్ నగర్ కి బదిలీ అయ్యాడు యూబీఐ కార్వన్ మేనేజర్ మస్తాన్.. ఎఫ్ డీలక్స్ క్లోజింగ్ సమావేశానికి హాజరైన సందర్భంలో తాను రెండు బ్యాంకులకు మేనేజర్ గా పని చేస్తున్నాను అని చెప్పుకున్నాడు.. 21 నాడే అన్ని బ్యాంకులకు ఎఫ్‌డీలు క్లోజ్ చేయాలని తెలుగు అకాడమి లెటర్ రాసింది.. కానీ, కార్వాన్ బ్రాంచ్‌లో ఎఫ్‌డీలు క్లోజ్ చేసేందుకు సమయం కోరారు మస్తాన్‌వలి.. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నందున సమయం ఇవ్వలేమని తెలుగు అకాడమీ అధికారులు స్పష్టం చేశారు.. ఇదే సమయంలో తెలుగు అకాడమీ నకిలీ లెటర్ హెడ్ లు క్రియేట్ చేసి నిధులు మళ్లించే కార్యక్రమం చేపట్టారు.. అకాడమీ లెటర్ పై ఎప్పుడూ రబ్బర్‌స్టాంప్ ఉండదు.. లెటర్ హెడ్ చూడగానే అది నకిలీగా గుర్తించవచ్చు.. కానీ, ఫేర్ లెటర్ హెడ్ సృష్టించి.. సంతకాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు.
యూబీఐ కార్వాన్ బ్రాంచ్ నుండి రూ.95 లక్షలను రెండుసార్లు, ఆంధ్ర ప్రదేశ్ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ తెలుగు అకాడమికి పంపించాలని నకిలీ లెటర్ హెడ్ లు.. ఎఫ్‌డీ వెనకాల తెలుగు అకాడమీ డైరెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారు.. డిపాజిట్ల వెనుక అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ సంతకం మాత్రమే చేయబడుతుంది. తెలుగు అకాడమీ ఖాతా నుండి 63 కోట్ల రూపాయల నిధులు ఏపీ మార్కెట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బదలాయింపు పూర్తి చేశారు.. జనవరి 18 నుండి సెప్టెంబర్ 18 వరకు విడతలవారీగా నిధుల మళ్లించారు.. ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ బండారు సుబ్బారావు ఆదేశాల మేరకు నిధులు మళ్లించినట్లు.. ఆ బ్యాంక్ మేనేజర్ పద్మావతి ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు సీసీఎస్ పోలీసులు. ఇక, నిధుల్లో 10 శాతం కమిషన్ ను విజయవాడ హెడ్ ఆఫీసర్ కు బదిలీ చేవారు.. మిగతా డబ్బును గుర్తు తెలియని వ్యక్తికి ఇవ్వాల్సిందిగా సుబ్బారావు చెప్పారని చెబుతున్నారు. అయితే, ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన అంశాలు చాలా ఉన్నందున పద్మావతి, మోహినుద్ధిన్ లను కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోరుతున్నారు.