కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతలకు దారితీసింది. దిల్‌షుఖ్ నగర్ నుంచి పార్టీ ర్యాలీని చెపట్టానలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. ఎల్బీనగర్‌లోని కూడలిలో ఉన్న శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్త కళ్యాణ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్బీనగర్ చౌరస్తావద్దకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.
Read: హుజురాబాద్ అభ్యర్ధిని ప్రకటించిన కాంగ్రెస్…