సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే కాగా.. గతేడాది కార్మికులకు 68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది.. ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది.. తాజా నిర్ణయంతో సింగరేణిలో ఉన్న 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) 72,500 చెల్లించాలని అంగీకరించాయి. ఇక, సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీంతో.. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెల్లించేందుకు సిద్ధమయ్యారు.. ఈ నెల 11న ఆ బోనస్ చెల్లించనున్నారు.. నవంబర్ 1న దీపావళి బోనస్, ఈ నెల 8న పండుగ అడ్వాన్స్ చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.. సగటున కార్మికుడికి రూ. లక్షా 15 వేల వరకూ చెల్లించే అవకాశం ఉంది.. లాభాల బోనస్ రూ. 79.07 కోట్లు, దీపావళి బోనస్ రూ. 300 కోట్లు చెల్లించనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ వెల్లడించారు.