తెలుగు అకాడమి స్కాంలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి. తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపర్చారు. 9 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేశామని వీరిలో కీలక సూత్రదారి సాయికుమార్ గా తేల్చారు. ఈ కేసులో 10 మంది నిందితులు వివరాలు ఇలా ఉన్నాయి. A1. మస్తాన్ వలి (యూనియన్ బ్యాంక్ మేనేజర్), A2. రాజ్ కుమార్ (ఏజెంట్), A3. సత్యనారాయణ రాజు (AP మెర్కంటైల్ బ్యాంక్), A4. పద్మావతి (AP మార్కంటిల్), A5. మోహియుద్దీన్ (AP మార్కంటిల్), A6. చుందురి వెంకట సాయి కుమార్( కీలక సూత్రదారి), A7. నందురి వెంకటట్ రామన్ (ఏజెంట్), A8. వెంకటేశ్వర్ రావు (ఏజెంట్), A9. రమేష్ (తెలుగు అకాడమీ అకౌంటెంట్), A10. సాధన కెనరా బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. ఇక, కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ లు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారం లో నష్టపోయిన సాయి కుమార్ అనే నిందితుడు స్నేహితుడైన భూపతిని పెద్ద మొత్తంలో లోన్ కోసం సంప్రదించాడు. అధి సాధ్యం కాక పోవటంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను కాజేసేందుకు పథకరచన చేశారు. ప్రైవేట్ ఏజంట్స్ ద్వారా యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ వివరాలను సేకరించారు. మార్కైంటైల్ సొసైటీ ఖాతాల్లోకి డబ్బును మళ్లించి కమీషన్స్ ఎరజూపి విత్ డ్రా చేశారు. ఫేక్ అకౌంట్స్.. చెక్స్, పత్రాలు, ఐడీలు సృష్టించడంలో కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్ లు కీలకంగా వ్యవహరించారు. రూ.64.5కోట్లను కొల్లగొట్టి వాటాలుగా పంచుకున్నారు నిందితులు. సూత్రదారి సాయికుమార్ రూ. 20 కోట్లు తీసుకోగా ఇతర నిందితులు డబ్బునంతా భాగాలుగా పంచుకొన్నారు. వెంకటరమణ ఏడు కోట్ల, రాజ్ కుమార్ 3కోట్లు, వేంకటేశ్వర్ రావు మూడు కోట్లు, కృష్ణారెడ్డి ఆరుకోట్లు, భూపతి2.5కోట్లు, రమణా రెడ్డి, పద్మనాభన్ 60 లక్షలు, మదన్ 30 లక్షలు, మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రావు 10 కోట్లు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ 2.5 కోట్లు, కెనరా బ్యాంకు మేనేజర్ సాధన మరో రెండు కోట్లు, యోహన్ రాజు 50 లక్షలు వాటాలుగా పంచుకొన్నారని పేర్కొంది. పది నిందితులను అరెస్ట్ చేసినా పలువుర పరారీలో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు పోలీసులు. నిందితులు సాక్షాలను తారుమారు అవకాశం ఉందని.. కస్టడీకి తీసుకొని విచారించాలని కోరారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని 64 కోట్ల రికవరీకి ప్రయత్నిస్తున్నామని రిమాండ్ రిపోర్ట్ లో సిసిఎస్ పోలీసుల కోర్టుకు వివరించారు.