తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… గత కొంత కాలంగా.. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఛాలెంజ్‌లు కొనసాగుతుండగా.. తాజాగా, కేటీఆర్‌కు రేవంత్.. వైట్ ఛాలెంజ్ విసరడం.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువునష్టం దావా వేయడం లాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇక, ఇవాళ హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు టీఆర్ఎస్ కార్యకర్తలు.. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.. కాంగ్రెస్ –…
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా కూడా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 47,220 కి క్షీణించింది. ఇక , 10 గ్రాముల 22 క్యారెట్ల…
కరోనా కారణంగా చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం కొన్ని సర్వీసులను నడుపుతున్నారు. కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోవడంతో తిరిగి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి నగరంలో 100 శాతం బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. 1285 ఆర్టీసీ, 265 అద్దె బస్సులు కలిపి మొత్తం 1551 బస్సులు ఈరోజు నుంచి నగరంలో రోడ్డుమీదకు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని…
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెత్త స్వీకరణ కేంద్రం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో… స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే… స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది… మంటలను అదుపు చేసింది. ఈ ఘటన లో రెండు చెత్త రీసైక్లింగ్ మిషన్లు మంటలకు కాలి బూడిదయ్యాయి. అగ్నికి…
హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో…
ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 43,300 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర…
హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసరాల వైపుకు గణపయ్యలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో నిమజ్జన కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. దీంతో ఈరోజు కూడా నిమజ్జనం జరుగుతున్నది. నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ గణపయ్య వాహనాలతో నిండిపోయాయి. నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వర్షంలోనే శోభాయాత్ర…
హైదరాబాద్‌లో ప్రస్తుతం గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం తరువాత వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గణపతుల విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. ఇక నిన్నటి రోజున బాలాపూర్ లడ్డూ వేలం రికార్డుస్థాయిలో రూ.18.90 లక్షలకు అమ్ముడు పోయింది. అయిదే, బాలాపూర్‌తో పాటుగా నగరంలో అనేక మండపాల్లో వినాకుల లడ్డూలను వేలం వేశారు. ఎక్కడెక్కడ ఎంతెంతకు వేలం జరిగిందో…
పర్యావరణ అభిమానులు వినూత్న రీతిలో గణనాధున్ని నిమజ్జనం చేశారు. ఎల్.బి నగర్, చింతల కుంట ఆల్ ఇండియా రేడియో కాలనీ వాసులు చేసిన నిమజ్జనం ఆలోచింపచేసేలా ఉంది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న మట్టి వినాయకుడు ఈరోజు మధ్యాహ్నం వినూత్న రీతిలో గంగమ్మ వడిలో చేరాడు. కాలనీలోనీ కమిటీ హాల్ ప్రాంగణంలో గుంత , తవ్వి అందులో నీటి పైపులు పెట్టి నిమజ్జనం చేశారు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. దీనికి సంబందించిన వీడియో సోషల్…