ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన తర్వాత.. సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక ఆడ, ఒక మగ అధికారులతో కమిటీ ఉంటుందని.. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించి…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఒకరిపై ఒకరు మరీ పోటీపడి ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఒక రాష్ట్రం విధానం.. మరో రాష్ట్రానికి నచ్చడంలేదు.. ఇంకో రాష్ట్రం అవలంభిస్తున్న వైఖరి పక్క రాష్ట్రం జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది.. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రాసిన లేఖలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్…
బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా నెంబర్ల నుంచే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్న ఆయన… లేపేస్తం… చంపేస్తాం.. బాంబ్ పెడతామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. క్రిమినల్స్ ను పట్టుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి సోషల్ మీడియాలో, మీడియా లో ప్రమోట్ చేసుకుంటారని… మరి తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ కు సంబంధించిన నెంబర్లతో సహా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశా… మరి ఇప్పుడు డీజీపీ ఏం చేస్తారో…
మరోసారి మద్యం షాపుల లైసెన్స్ గడువు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం.. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్స్ షాపులు మూత పడటంతో లైసెన్స్‌లను నెల రోజుల పాటు పొడిగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా మూతపడిన కారణంగా… బార్లు, వైన్స్‌ల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్ చివరినాటికి ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువును నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈనెల ఆఖరు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్…
ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కాగా, ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ…
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడటం దేశీయంగా ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 43,500కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి రూ.47,460కి చేరింది. ఇక బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో…
కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి వార్తలు వినవాల్సి వస్తుందో అనే ఆందోళనక కలిగించే పరిస్థితి నెలకొంది.. ఇక, ఈ మధ్య వరుసగా హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న దారుణమైన ఘటనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారయత్నం చేశాడో గుర్తుతెలియని యువకుడు. బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్న స్థానికులు.. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అతన్ని…
లిక్కర్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపటి క్రితమే విడుదల చేశారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్.. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వం ఏ- 4 రిటైల్…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు… రేవంత్‌రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది… పరువు నష్టం కేసులో ఇంజెక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగిశాయి.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్.. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది కోర్టు.. కాగా, తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పరువునష్టం దావా వేశారు.. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నిరుద్యోగ సమస్యను ఆయుధంగా మలచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనికోసం ప్రతీ మంగళవారం ఒక చోట నిరుద్యోగ దీక్ష చేస్తూ వస్తున్నారు.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ.. వారికి ఆర్థికసాయం చేయడం.. ఆ తర్వాత కొన్ని గంటల పాటు దీక్ష చేస్తూవస్తున్నారు. అయితే, దీక్ష కోసం తమను తీసుకొచ్చి డబ్బులివ్వడం లేదని ఆరోపిస్తూ అడ్డా కూలీలు ఆందోళనకు దిగడం చర్చగా మారింది.. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి..…