మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మొత్తంగా వెయ్యి ఓట్లు కూడా లేని మా ఎన్నికలపై అంతా ఫోకస్ పెట్టేలా పరిస్థితి తయారైంది.. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన కొంతమంది తప్పుకున్న తర్వాత.. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.. దీంతో.. రెండు ప్యానెళ్లకు చెందినవారి మధ్య యుద్ధమే నడుస్తోంది.. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రూ.10 వేలు పంచుతుందంటూ.. మెగా బ్రదర్ నాగబాబు కామెంట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ ఆ కామెంట్లపై సెటైర్లు వేశారు మంచు విష్ణు.. మా ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలో.. ‘మా’ ఎన్నికల్లో ఒక్కొక్కరికి రూ. 75 వేలు ఇస్తున్నాం.. రూ.10 వేలు అని నాగబాబు అంటున్నారు.. అది తప్పు అని సెటైర్లు వేస్తూనే.. మధ్యలోకి సూపర్ స్టార్ మహేష్‌బాబుని లాగారు.. మహేష్‌బాబుకు కూడా రూ.75 వేలు గూగుల్ పే చేసాం అంటూ సెటైరికల్ కామెంట్లు చేవారు మంచు విష్ణు.