పింఛన్ల దరఖాస్తు గడువును మళ్లీ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆసరా వృద్ధాప్య పింఛన్లు అందించడానికి సిద్ధం అవుతుతోన్న సర్కార్.. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారం.. గత నెలలోనే గడువు ముగిసిపోగా.. మరో అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. మీసేవ కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ…
తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి అనేక కంపెనీలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ -ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ఐపాస్, సింగిల్ విండో అనుమతులు లాంటి అనేక చర్యలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.…
తెలంగాణలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తెలంగాణలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009 లో తెలంగాణలో సంపూర్ణంగా తిరిగానని అన్నారు. తనను దెబ్బకొట్టేకొద్దీ మరింత ఎదుగుతానని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బలమైన సామాజిక మార్పుకోసం ప్రయత్నిస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు…
తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నేడు మరో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు పోలీసులు.. ఇదే కేసులో అరెస్ట్ అయినఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అటు ఈ కేసులో ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీ కి…
నిన్నటి రోజున నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు నగరంలో పెద్ద ఎత్తున వరద సంభవించింది. ఈ వరద కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద వచ్చిచేరింది. ఈ వరద కారణంగా జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. ఈ వరదల్లో మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.…
బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందని తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాక్’ ను ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, కాబట్టి జాగ్రత్తలు…
నిన్న రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపైకి వరదనీరు వచ్చి చేరింది. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిన్నటి వర్షం నుంచి ఇంకా కోలుకోక ముందే జీహెచ్ఎంసీ అధికారులు మరో కీలక సూచనలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ప్రజల…
దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెరిగాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.84 కాగా… లీటర్ డీజిల్ రూ. 92.47 గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ. 109.84, కాగా… డీజిల్ రూ .100.29 కు పెరిగింది.కోల్కతాలో పెట్రోల్ రూ. 104.52 కాగా.. డీజిల్ రూ. 95.58 గా నమోదైంది. అలాగే… చెన్నైలో పెట్రోల్ రూ .101.27…
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. మొత్తం అరు బిల్లులకు సభ ఆమోదం తెలపగా… ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తం 32 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. ఆఖరి రోజు సభలో సంక్షేమ పధకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని కోరారు భట్టి. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ అర్హులకు అందడం లేదని…
హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది… దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొడుతోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మలక్పేట్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, బడంగ్పేట్, మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, శంషాబాద్ సహా తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.. దీంతో.. పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. దీంతో.. అప్రమత్తమైన…