గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. అయితే ఈ బదిలీల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత మరోసారి తన స్థానాన్ని వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కూకట్‌పల్లిని వీడేందుకు మమత విముఖత చూపారు. దీంతో ఆమెను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గానే కొనసాగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్
మంగళవారం నాడు కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమతను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న పంకజను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ పంకజను మున్సిపల్ శాఖ కూకట్ పల్లికి బదిలీ చేసింది. కాగా గతంలోనూ డిప్యూటీ కమిషనర్ హోదాలో మమతను చందా నగర్ నుంచి జూబ్లీహిల్స్ కు బదిలీ చేయగా ఆమె జాయిన్ కాకుండా శేరిలింగంపల్లికి మార్పించుకున్నారు.