హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు మళ్ళీ ఎక్కువయ్యాయి. నగరంలో పలు చోట్ల రేసింగ్‌లు చేస్తున్నారు యువకులు. బండి నెంబర్ ప్లేట్లు తీసి రేసింగ్‌లకు పాల్పడుతున్నారు యువకులు. అయితే లాంగర్ హౌస్‌లో ఈ రేసింగ్‌లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుమీద వేగంగా వెళ్లడంతో తోటి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. రేసింగ్‌లకు పాల్పడే వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజీల ఆధారంగా బైక్ రేసర్లను పట్టుకుంటాం అని పోలీసులు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా లేని…
ఇప్పటి వరకు ప్రతి ఆదివారం రోజున ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్డే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద నిర్వహించడానికి పట్టణాభివృద్ధి శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సండేఫండే కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందని, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు ఆనందాన్ని వ్యక్తం చేశారని, ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్దకూడా నిర్వహించాలని సూచించారని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్…
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 43,900 కి చేరింది.…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నెల 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే రెండు బోర్డులు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం… గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు.. ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్రచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు… కాగా, దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు…
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘దిశ’ ఘటన సంచలనం సృష్టించింది.. హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. అయితే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల జస్టిస్ వీఎస్ సిర్పూర్ కర్ కమిషన్ నియమించింది.. ఆ కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుండగా.. ఇవాళ అత్యంత కీలకంగా మారింది.. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ఇవాళ త్రిసభ్య కమిటీ…
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇప్పటికే సమావేశం అయ్యింది.. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించారు.. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై సమాలోచనలు చేవారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను…
మన ఇండియా లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర…
ఉత్కంఠబరితంగా సాగుతోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మధ్యామ్నం 2 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానెళ్లకు చెందిన.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణుతో మాట్లాడి.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ను పొడిగించారు.. ఇక, ఈ ఏడాదిలో మా ఎన్నికల పోలింగ్ కొత్త రికార్డులను సృష్టించింది చివరి సమాచారం అందినప్పటి వరకు 665 మంది ఓటుహక్కు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించినట్టు ప్రకటించారు.. కాగా, ఇప్పటికే మా ఎన్నికల్లో పోలింగ్…