హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. అక్కడ అంత డబ్బు పంచుతున్నారాట.. ఈ బ్రాండ్ లిక్కర్ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్‌కు చేరింది.. డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియగా.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను డబ్బులు ఆశ చూపి మభ్యపెడుతున్నారని… హైకోర్టు న్యాయవాదీ సలీమ్ కమిషన్ కు వివరించారు. ఓటుకు ఆరు వేల ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నప్పటికీ… అధికారులు, పోలీస్ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలు… ఇలా డబ్బు ప్రలోభలతో జరగడం చాలా ప్రమాదకరమని తెలిపారు. ఎన్నికలు పూర్తైయ్యే వరకు పోలీసులు, ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని హెచ్‌ఆర్సీని కోరారు.