వైద్యులు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఈ దృశ్యం కన్పించింది. నిన్న ఆస్పత్రిలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి ఓ వైద్యురాలి తలకు గాయమైంది. దీంతో వైద్యులు ఈ రోజు హెల్మెట్లు ధరించి ఆస్పత్రిలో విధులకు వచ్చారు. ఆస్పత్రిలో శిథిలమైన సీలింగ్ ఫ్యాన్లను చూసి భయపడుతున్నారు. ఎప్పుడు, ఎక్కడా ఏ ఫ్యాన్ ఊడి మీద పడుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు రక్షణ లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని,…
ఇప్పటి జనరేషన్ జనాలు చాలా బిజీ లైఫ్ కు అలవాటై పోయారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడుతూ.. పక్కవారిని పట్టించుకోవడం లేదు. అసలు ఇంట్లో వాళ్లనే పట్టించుకోనంత బిజీ అయిపోయారు. ఇది ఇలా ఉండగా… హైదరాబాద్ మెట్రోలో అమ్మకు అవమానం జరిగింది. ఓ బాలింత, పసికందుతో పాటు మెట్రో ఎక్కింది. మెట్రోలోని సీట్లు ఫుల్‌గా ఉండడంతో.. చేసేదేమి లేక నేలపై కూర్చుంది. ఆమె రావడం కూర్చోవడం అందరూ చూశారు. కానీ ఎవరూ ఆమెకు సీటివ్వలేదు. అమ్మకు సీటిచ్చేందుకు…
మన దేశం లోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 44, 850 కి…
హైదరాబాద్ వేదికగా జరిగిన గులాబీ పండుగ (టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ) సమావేశాలు ముగిశాయి… దాదాపు 8 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ సాగింది.. మొత్తం 7 తీర్మానాలపై ప్లీనరీలో చర్చించింది ఆమోదం తెలిపారు.. అందులో కీలకమైనది పార్టీ బైలాస్‌లో పలు సవరణలకు ప్లీనరీ ఆమోదించడం.. పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా తీర్మానం చేశారు.. దీంతో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చినట్టు అయ్యింది.. ఇక, బీసీ గణన,…
మన దేశంలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన.. పసిడి ధరలు మరోసారి ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44, 760 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10 పెరిగి రూ. 48, 830 కి చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా ఇవాళ కాస్త…
గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అదృశ్యమైన బాలుడు అనీష్ కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యేనని అంటున్నారు.గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన అనీష్ కుమార్ కోసం చుట్టు పక్కల మొత్తం వెతికారు. బాలుడి మృతదేహం లభించిన నీళ్ల కుంట వద్ద కూడా పోలీసులతో ముందు రోజే గాలించారు. అక్కడ బాలుడికి సంబంధించిన ఏలాంటి ఆనవాలు లభించలేదు. కానీ మరుసటి రోజు మృతదేహం నీళ్ల…
అత్తాపూర్ ఎమ్ ఎమ్ పహాడీలో తల్లితో పాటు ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లి అమ్రీన్, పిల్లలు అక్సా బేగం, అజా బేగం కనిపించకుండా పోయారు. వారు ఎంతకీ వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశాడు భర్త అభరార్. చుట్టూ పక్కల తీవ్రంగా గాలించిన భర్త. ఎక్కడా వాళ్ల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో భార్యా పిల్లలు…
హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కి మంచి డిమాండ్ ఉన్నది. కేవలం హైదరాబాద్ కు మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు కూడా ఈ బిర్యానీ ఎగుమతి అవుతుంటుంది. అయితే, భాగ్యనగరంలో ఈ బిర్యానీ ఒక్కటి మాత్రమే కాదు. ఎన్నో రకాల వంటకాలు ఫేమస్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లెగ్‌పీస్ జాయింట్ పీస్ బిర్యానీ. డొన్నె బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, మండీ బిర్యానీ, ఇందులో డొన్నె…
హైదరాబాద్‌లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో జరిగే ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో…