దళితబంధు పథకంపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి… వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని.. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని పేర్కొంది.. దళిత బంధు పథకం ఉప ఎన్నికల సమయంలో హుజురాబాద్ అమలుపై తీర్పు వెల్లడించింది సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం.