హైదరాబాద్ మెట్రో రైలులో ఓ గర్భిణీ మహిళ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారికి కనీసం మానవత్వం లేదా అనే కామెంట్లను పెడుతున్నారు. మనిషి అన్న తర్వాత ఇతరుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఓ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు.
Read Also: షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖ యాంకర్
అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం టీఎస్ఆర్టీసీ అని సజ్జనార్ వెల్లడించారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి నైతిక విలువలను పెంచుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా సజ్జనార్ పోస్ట్ చేశారు. సదరు వీడియోను వినూత్న రీతిలో విద్యార్థులతో రూపొందించారు. ఈ వీడియోలో బస్సు రన్నింగ్ లో ఉండగా.. తొలుత ఓ వృద్ధురాలు రాగా వేరేవారు నిలబడి ఆమెకు సీటు ఇస్తారు.. తర్వాత వికలాంగురాలు, చిన్నారితో బస్సు ఎక్కిన మహిళ, గర్భిణీ మహిళలకు వేరేవారు తమ సీట్లను త్యాగం చేసి వారికి ఇస్తారు. ఈ వీడియోను ఉదహరిస్తూ ఇలా అవసరమైన వారికి సీటు ఇచ్చి గౌరవించడం కేవలం ఆర్టీసీలోనే జరుగుతుందని సజ్జనార్ పేర్కొన్నారు.
అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం మన #TSRTC బస్సు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం. నైతిక విలువలను పెంచుకుందాం@puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @ChaiBisket @Kurmanath @imvangasandeep @HiHyderabad #Moralvalues #motivation #WednesdayMotivation pic.twitter.com/bOdUViKZYP
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 27, 2021