ట్వీట్టర్ వేదికగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై అనసూయ పరోక్షంగా స్పందించింది. తన వేషధారణ గురించి కొందరూ కామెంట్ చేస్తున్నారని, సినిమాల్లో ఇంతకన్నా దారుణంగా ఉన్న వారి వస్త్రధారణ గురించి మాట్లాడకుండా తననే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. ఎంతో అనుభవమున్న వ్యక్తి ఇలా నీచంగా తనను కించపరుస్తూ మాట్లాడటం సబబు కాదన్నారు. అంతటి అనుభవమున్న వ్యక్తి మహిళలను కించపరుస్తూ, తాగుతూ నటించిన సోషల్ మీడియా, ప్రజలు పట్టించుకోకపోవటం దారుణమని ట్విట్టర్ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేస్తూ షాకింగ్…
రోజు రోజుకు పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ రూ.100కు పైనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాల్లో బతుకు జీవుడా అంటూ జీవీతాలను గడిపే సామాన్యులు పెరిగిన ధరలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు కంపెనీల్లో మార్పుల వల్ల దేశీయచమురు కంపెనీల ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.9 గా ఉండగా, డీజీల్ ధర103.18 గా…
మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజును మిలాద్ ఉన్ నబీ గా జరుపుకుంటారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పాతబస్తీలోని ప్రధానమైన రహదారుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మిలాద్ ఉన్ నబీ కి ముందురోజే మసీదులు, మైదానాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను వివరిస్తారు. ఇక ఈరోజు ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, మిలాద్ ఉన్ నబీ రోజున చార్మినార్ నుంచి మొఘల్ పురా…
మన దేశంలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన.. పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 44, 300 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 120 పెరిగి రూ. 48, 330 కి చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా ఇవాళ కాస్త…
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,200 కి చేరింది.…
సీనియర్ పొలిటికల్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. గత కొంత కాలంగా ఆయన కారెక్కుతారు అనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తున్నారు.. ఇక, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను తెలంగాణ అంబేద్కర్గా అభివర్ణించారు.. మరోవైపు.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్లో చేరడం.. ఆయనను దళిత బంధు ఛైర్మన్‌గా నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.. ఈ…
ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా…
విజయ దశమి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వమించారు.. ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్…సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయన.. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతులు, హిమాన్షు,…
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణం అందరినీ కదలిస్తోంది.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంలో విప్లవోద్యమంలో పనిచేసిన ఆయన.. చివరకు ఆ అడవి తల్లి ఒడిలోని కన్నుమూశారు.. అయితే, ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆర్కేతో నాకు 1994 నుంచి పరిచయం ఉందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకన్న ఆయన.. వివిధ అంశాల్లో కేంద్ర కమిటీ సూచించిన డైరెక్షన్ లో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు.…
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా…