కరోనా బాధితుల్లో యువతే టాప్..! నివేదిక విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినా.. ఇతర దేశాల్లో మళ్లీ భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. థర్డ్ వేవ్ తప్పదా? అనే ఆందోళనకు నెలకొన్నాయి.. ఓవైపు కోవిడ్ పోయిందనే భావనతో నిబంధనలు సడలిస్తూ వస్తున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందేమోన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇక, కరోనా బారినపడుతున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 20 ఏళ్లలోపు యువతే 90,561 మంది ఉన్నారని పేర్కొంది. పదేళ్లలోపు పిల్లలు 19,445 మంది కోవిడ్ బారినపడినట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు, మృతులపై వయసుల వారీగా నివేదిక రూపొందించింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో 61.4 శాతం మంది పురుషులు కాగా.. 38.6 శాతం మంది మహిళలు ఉన్నట్టు పేర్కొంది. ఇక, 31-40 ఏళ్ల బాధితులు 21.8 శాతం మంది.. అందులో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు ఉండగా.. 41-50 ఏళ్ల మధ్య వయస్కులు 17.5 శాతం, 51-60 ఏళ్ల వారు 14.4, 61-70 ఏళ్ల మధ్య ఏజ్‌వారు 7.7, 71-80 ఏళ్ల వారు 2.7, 81 ఏళ్లు పైబడినవారు 0.7 శాతం మంది కోవిడ్ బారినపడినట్టు నివేదికలో పేర్కొంది వైద్యశాఖ.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌తో మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నారని ఆ నివేదికలో వెల్లడించారు.. ఇక, తాజా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,829కి పెరగగా.. మృతుల సంఖ్య 3,951గా ఉంది.. ఇప్పటి వరకు నిర్వహంచిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,74,30,113కు పెరిగింది.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!