డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ముంబైలో ఈ మూవీ కోసం సాంగ్ పిక్చరైజేషన్ ప్రారంభించారు. ఇటీవల ‘రొమాంటిక్’ మూవీ ప్రీ రిలీజ్ కు వరంగల్ వచ్చిన పూరి, ఛార్మి, విజయ్ దేవరకొండ తిరిగి ముంబైకి చేరుకుని, ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే… ఈ రోజు ముంబై నుండి పూరి జగన్నాథ్, ఛార్మి తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. పూరి తనయుడు ఆకాశ్ పూరి నటించిన ‘రొమాంటిక్’ మూవీ ఈ నెల 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి ఎ.ఎం.బి. థియేటర్ లో సెలబ్రిటీస్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు.
ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలు కూడా కావడంతో ఈ స్పెషల్ షో కు ముంబై నుండి హుటాహుటిన బయలుదేరి వారు వస్తున్నారు. వీలైతే పూరి జగన్నాథ్ ‘రొమాంటిక్’ మూవీ విడుదల వరకూ హైదరాబాద్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. మరి ముంబైలో ‘లైగర్’ పాట చిత్రీకరణ పూర్తి అయ్యిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ‘రొమాంటిక్’ చిత్రాన్ని పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ డైరెక్ట్ చేయగా, సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. కేతికా శర్మ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. పూరి జగన్నాథ్, ఛార్మి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.