దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం భారీగా పెరిగిపోతున్నది. ప్రతిరోజు కొత్త కంపెనీల వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ ఒక్కటే ప్రధాన సమస్య. ఛార్జింగ్ పెట్టేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ ట్రావెలింగ్ సమయంలో చార్జింగ్ అయిపోతే ఏం చేయాలి అన్నది ప్రధాన సమస్య. అన్ని నగరాలతో పాటు, హైదరాబాద్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్…
వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్ విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్ బెంగళూరు-బీదర్-బెంగళూరు హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్ హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్ ముంబై-నాందేడ్-ముంబై ముంబై-కొల్హాపూర్-ముంబై ముంబై-జలగావ్-ముంబైఈ రూట్లలో ట్రూజెట్…
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు ఊరట కల్పించిది నాంపల్లిలోని స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడిన వాహనాదారులకు రూ. 2,100 ఫైన్ కట్టించుకుని వదిలేస్తోంది కోర్టు. 2018 ఏడాది నుండి 28,938 పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.. ఇక, ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు ఫైన్ కట్టుకునే అవకాశం కలిపించింది నాంపల్లి కోర్టు.. దీంతో, నాంపల్లి లోక్‌అదాలత్ వద్ద క్యూ కడుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్…
హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి… పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన దుండగులు.. దారి దోపిడీకి పాల్పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. టైర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపిన దుండగులు.. లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.. డ్రైవర్‌ను భయపెట్టి 44 లక్షల రూపాయల విలువైన టైర్లను అపహరించారు.. డ్రైవర్ పై కాల్పులు జరిపి లారీని అపహరించరు దుండగులు.. ఆ తర్వాత టైర్లు అన్నింటినీ గోదాంలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డ్రైవర్ని వదిలిపెట్టింది…
హైదరాబాద్‌లో కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఇవాళ నెల్లూరుకు తరలించనున్నారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం ఉండగా.. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తారు.. బేగంపేటఎయిర్…
జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది.. దీనిపై స్పందించిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డి ఇష్యూ మా దృష్టికి వచ్చింది.. మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి మా నాయకుడు.. మా అధిష్టానం అపాయింట్ మెంట్ కోరారు.. జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటామని.. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.. గతంలో సీనియర్ నేత వీహెచ్‌పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. ఆరా…
ఏపీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లకుండా పనులు…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లను బాధిత కుటుంబ సభ్యులు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. వెంకటాద్రి థియేటర్ వద్ద, కోణార్క్ థియేటర్ వద్ద చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో 17 మంది మరణించారు. సైకిల్‌పై టిఫిన్ బాక్సులో ఉగ్రవాదులు బాంబులు పెట్టడంతో సంభవించిన ఈ పేలుళ్లలో 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్,…
హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగర శివారులోని దుండిగల్‌లో ఏటీఏం కేంద్రాలకు డబ్బు తీసుకువెళ్లే వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరారయ్యాడు. బేగంపేటకు చెందిన రైటర్స్ సంస్థ సిబ్బంది పలు ఏటీఏం కేంద్రాల్లో నగదు జమ చేస్తుంటారు. ఈ సంస్థలో 20 రోజుల క్రితమే సాగర్(25) అనే యువకుడు డ్రైవర్‌గా చేరాడు. శనివారం మధ్యాహ్నం రూ. 64 లక్షల నగదుతో కస్టోడియన్లతో కలిసి సాగర్ రైటర్స్ సంస్థ కార్యాలయం నుంచి బయలుదేరి జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.13…
హైదరాబాద్ లో ఓలా, ఉబెర్ వాహనాలు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. నగరంలో ఎన్ని కొత్త రవాణా యాప్‌లు వచ్చినా ఆదరణ లభిస్తున్నది. నగరంలో ఉన్న వాహనాలు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాలన నుంచి కూడా వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. ఉబెర్, ఓలా యాప్‌లకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. అయితే, నగరంలో రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వాహానాలను కూడా వినియోగించుకుంటుండటంతో ఆటోవాలాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కీలక నిర్ణయం…