టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఆఫర్‌ను ఆర్టీసీ ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఉచితంగా ప్రయాణించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. 250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి నగరానికి చేరుకున్న ప్రయాణికులు రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా వెళ్లవచ్చని…
హైదరాబాద్ కృష్ణానగర్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తరగతి గదిలో సరదాగా ఆడుకున్న ఆట ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్‌లోని సాయికృప హైస్కూలులో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్‌తో క్రికెట్ ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆటలో భాగంగా విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. నలుగురు విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్‌పై దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి.…
దేశంలో అత్యధిక మంది కోటీశ్వరులు ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో కోటీశ్వరుల విషయంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సర్వే చేసింది. ఈ జాబితాలో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఫార్మా, బయోటెక్ రంగాలతో పాటు ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కోటీశ్వరులు సంపదను వెనకేసుకోవడంలో దూసుకుపోతున్నారు. దాదాపు రూ.220 కోట్ల సంపద ఉన్నవాళ్లు హైదరాబాద్ నగరంలో 467 మంది ఉన్నారని నైట్ ఫ్రాంక్ సర్వే…
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్‌తో పాటు…
నీలోఫర్ ఆస్పత్రి నవజాత శిశువులు, వివిధ ఇబ్బందులతో వున్న చిన్నారులకు భరోసా కల్పించే ప్రభుత్వాసుపత్రి. ఎంతో చరిత్ర వున్న ఈ ఆస్పత్రిలో అప్పుడప్పుడు వైద్యం అందక చిన్నారులు మరణిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి వివాదం రేపింది. ఆస్పత్రిలో ఉదయం ఇద్దరు చిన్నారులకు ఇంజక్షన్లు ఇచ్చింది నర్స్. అయితే, ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే ఇద్దరు పిల్లలు చనిపోయారంటున్నారు తల్లిదండ్రులు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆరోగ్యం విషమించిందని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ఈ…
ఇబ్రహీం పట్నంలో సంచలనం కలిగించిన కాల్పుల ఘటనలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో రెండు లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి ఎక్కడి నుంచి తెచ్చారనేది ఆరాతీస్తున్నారు. కారులో రెండు క్యాట్రిడ్జీలను స్వాధీనం చేసుకుంది క్లూస్ టీమ్. శ్రీనివాస్ రెడ్డిని షాట్ వెపన్ తో, రాఘవేంద్ర రెడ్డి పై తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. రాఘవేందర్ రెడ్డి మృతదేహం నుండి బుల్లెట్ ను తీసి పోలీసులకు అందజేశారు వైద్యులు. శ్రీనివాస్…
హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వాట్సాప్ చాటింగ్ చేసిన పాపానికి ఓ యువతి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతికి వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అయితే న్యూడ్‌గా చాటింగ్ చేయమని సదరు యువతిని యువకుడు కోరాడు. అతడి మాటల మత్తుకు పడిపోయిన యువతి న్యూడ్ చాటింగ్ చేసింది. కానీ కంత్రిగాడు న్యూడ్ ఛాటింగ్‌ను రికార్డు చేశాడు. అనంతరం న్యూడ్ ఛాటింగ్ రికార్డును అడ్డం పెట్టుకుని యువతిని సదరు…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి… ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా చెబుతున్నారు.. ఇటీవలే 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు.. అయితే, అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాడు మట్టారెడ్డి అనే వ్యక్తి..…
ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసి చలానాలు వేసుకున్నవారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. భారీ డిస్కౌంట్‌తో క్లియర్ చేసుకోవడానికి అవకాశం కలిపించింది ప్రభుత్వం.. కొన్నిసార్లు ఆ చలానాలు కట్టలేక వాహనాలను వదిలేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ చలానాలు ఉన్నవాళ్లకి ట్రాఫిక్ పోలీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన ప్రత్యేక డ్రైవ్‌కు…