MLC Kavitha: జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధర పెంచుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీస్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంపై ఫైర్ అయ్యారు.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందన్న కవిత.. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో రైతులు ఆందోళనలో ఉన్నారు.. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధాన్యం సేకరణ పై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: AP Legislative Council: టీడీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం.. 8 మంది సస్పెన్షన్
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
తెలంగాణ ఉద్యమం తర్వాత మనం రోడ్లపైకి రావడం మళ్లీ ఇదే మొదటిసారి అన్నారు ఎమ్మెల్సీ కవిత.. బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి అంటూ ఫైర్ అయిన ఆమె.. గ్యాస్ సిలిండర్ 400 రూపాయాలకే ఇవ్వాలని.. పెరిగిన భారాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్‌పై మండిపడ్డ ఆమె.. వాళ్లను, వీళ్లను జైలులో పెట్టిస్తా అంటాడు.. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్ పై తెలంగాణకు సబ్సిడీపై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించాలని సూచించారు.. పేద ప్రజలకు మోడీ సర్కార్ ఏమి చేయలేదని విమర్శించిన కవిత.. పెద్ద పెద్ద వాళ్లకు రుణమాఫీ చేసింది మోడీ సర్కార్ అని.. అంబానీ, ఆదానీలకు, దేశం విడిచివెళ్లిన విజయ్ మాల్యాకు మాత్రమే రుణమాఫీ జరిగిందంటూ ఎద్దేవా చేశారు.. ప్రజా ఉద్యమ నిర్మాణం పటిష్టంగా చేస్తే ఈ కేంద్ర సర్కార్ దిగివస్తుందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేద్దామని సూచించారు ఎమ్మెల్సీ కవిత.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!