Telangana: బోయిగూడ అగ్నిప్రమాదంపై సర్కార్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీరియస్ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. అగ్నిమాపక శాఖ, హైదరాబాద్ పోలీస్, జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్ అధికారులతో సమావేశానికి సిద్ధం అయ్యారు హోమంత్రి మహమూద్ అలీ.. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు హోం మంత్రి.. ఈ సమావేశంలో బోయిగూడ స్క్రాప్ గోదాంలో జరిగిన ప్రమాదంపై విశ్లేషించనున్నారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయి, వాటి అనుమతులపై కూడా రివ్యూ చేయనున్నారు.. మరోవైపు.. తరుచూ గోదాంలపై దాడులు చేయాలని అగ్నిమాపక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి మహమూద్ అలీ..
Read Also: Vizag Steel Plant: లోక్‌సభలో ఉక్కుశాఖ మంత్రి కీలక ప్రకటన
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
కాగా, బోయిగూడలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.. ఈ సమయంలో గోదాంలో ఉన్న 12 మందిలో ఒకరు తప్పించుకోగా.. 11 మంది బీహార్ కార్మికులు సజీవదహనం అయ్యారు.. గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి.. వారి బంధువుల సహాయంతో గుర్తించారు వైద్యులు.. మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మృతదేహాలను వారి స్వస్థలాలకు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈరోజు 6 మృతదేహాలు, రేపు మరో 5 మృతదేహాల తరలించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.. ఆరు గంటలకు బెంగళూరుకు ఆరు మృతదేహాలను తరలించనుండగా.. ఈరోజు వెళ్లిన మృతదేహాలు బెంగళూరులో భద్రపరుస్తారు.. ఇక, రేపు 5 మృతదేహాలను తరలించనున్నారు.. మొత్తం 11 మృతదేహాలను రేపు స్వస్థలాలకు పంపించనున్నారు. ఇక, అగ్నిప్రమాదం జరిగిన స్క్రాప్ గోదాం కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు అధికారులు.. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ప్రమాదకరంగా మారింది రేకుల షెడ్డు.. దీంతో షెడ్డు కూల్చివేసేందుకు చర్యలు చేపట్టారు.. ఆరు జేసీబీలతో గోదాంను కూల్చివేయనున్నారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్.. ఇతర పార్టీ నేతలు, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. ప్రధాని మోడీ రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి విదితమే.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!