TS RTC: ఆర్టీసీకి రవాణా శాఖ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో.. బస్సుల సంఖ్య మరంత తగ్గిపోనుంది.. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను నడపొద్దంటూ రవాణా శాఖ ఇచ్చిన నోటీస్‌లతో బస్సుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 97 డిపోల పరిధిలో 9,708 బస్సులు తిరిగాయి. ఇందులో 3,107 అద్దె బస్సులున్నాయి. కాలంచెల్లినందున సంస్థ సొంత బస్సుల్లో కాలంచెల్లిన 600 బస్సులను పక్కనబెట్టనున్నారు. వాటి స్థానంలో 500 ఎలక్ట్రికల్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Read Also: Telangana: హైకోర్టుకు 10 మంది కొత్త న్యాయమూర్తులు..
Also Read
- CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
సంస్థకు ఉన్న బస్సులు, వాటి కండిషన్‌పై రివ్యూ చేశారు ఎండీ సజ్జనార్. మొత్తం 97 డిపోల వారీగా మొత్తం బస్సులు, తిరుగుతున్న రూట్లు, సిబ్బంది, ఆదాయం, నష్టంతో పాటుగా డిపోకు ఉన్న భూముల గురించి సమగ్రంగా వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. లాభ, నష్టాల ఎజెండా ప్రాతిపదికగానే… సజ్జనార్ ఈ రివ్యూలు చేసినట్టు సమాచారం. 97 డిపోలు కూడా నష్టాల్లోనే ఉన్నాయని, కొన్నింటిలో నష్టాలు మూడింతలుగా ఉన్నట్టుగా తేలింది. ఫలితంగా మొదట కొన్ని డిపోలను మూసేసి అక్కడి సిబ్బందిని వేరే డిపోల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల లేదా మెట్‌పల్లి, హుజురాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ -2 లేదా హన్మకొండ డిపో, ఘన్‌పూర్, నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి డిపోలను మూసేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ డిపోలకు చెందిన బస్సులను ఈ మధ్యే పక్క డిపోలకు పంపించారు. అలాగే ఒక్కో డిపోలో కనీసం 121 బస్సులు ఉండాల్సి ఉండగా 80కి తగ్గించారు. వీటిలో కాలంచెల్లిన బస్సులు సగంవరకు ఉన్నాయని కార్మికులంటున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్-3, మియాపూర్ డిపోలను మూసేశారు. ఈ మధ్యే పికెట్ డిపో క్లోజ్ అయినట్టు సమాచారం. ఎక్కువ నష్టాలు వస్తున్న 17 డిపోలను మొదటివిడతలో మూసేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా నష్టాలు, కాలం చెల్లిన బస్సులు, రవాణా శాఖ నిబంధనలు తెలంగాణ ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?