సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు.. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి.. అందులో మొత్తం 12 మంది ఉండగా.. ఓ యువకుడు మాత్రం.. మంటలు చెలరేగిన తర్వాత.. గోడ దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.. కానీ, మరో 11 మంది సజీవదహనం అయ్యారు.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.. ఇక, ఘటనా స్థలాన్ని సీఎస్ సోమేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తదితరులు పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు.
Read Also: ED Raids: టార్గెట్ మహా సర్కార్..? ఈడీ రైడ్స్ కలకలం..
అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడం పట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్.. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు తెలంగాణ సీఎం.. మృతుల కుటుంబాలకు ఆ మొత్తాన్ని అందజేయనున్నారు. ఇక, ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం సోమేష్ కుమార్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.. చనిపోయిన వాళ్లంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్లు.. వారి వారి ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ఇలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతున్నాం అని వెల్లడించారు.