శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమంలో భాగంగా శనివారం 108 దివ్యదేశ మూర్తుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాదిమంది వీక్షించి తరించారు. ఈ విశిష్ట కార్యక్రమం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అద్భుతంగా వివరించారు. భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తూ సంచరిస్తుంటాడు. ఆలయాల్లో, ధ్యానం చేసేవారి మనసులలో భగవంతుడు కొలువై వుంటాడు. విగ్రహ రూపంలో ఆలయాల్లో వుండే రూపం మనకు కనిపిస్తుంది. అవతరాల్లో వుండే రూపం ఆయా కాలాల్లో కనిపిస్తుంది. వైకుంఠం…
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేవారు పోలీసులు.. టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై అభియోగాలు నమోదు చేవారు.. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కూడా అభియోగాలు మోపారు.. ఇక, వ్యాపారవేత్తను ఐటీ అధికారుల పేరుతో కిడ్నాప్ చేసిన కేసులో.. వ్యాపారవేత్త కిడ్నాప్‌నకు ప్లాన్ చేసిన సుపారి గ్యాంగ్‌పై కూడా అభియోగాలు నమోదు చేశారు.. మొత్తం 16…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. తెలంగాణతో పాటు ఏపీలోనూ నాలుగు వందలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీలో గత 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా.. 425 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,486 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,950కి చేరుకోగా.. రికవరీ కేసులు 22,93,882కు చేరాయి.. ఇక, ఇప్పటి వరకు 14,710…
సినిమా టికెట్లతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా కొనసాగగా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమ తరపున ముందుడి.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు.. ఇక, సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన చర్చించారు.. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కూడా వెళ్లి సమస్యల…
కేవలం మూడు వందల రుపాయలు ముగ్గురిని జైలు పాలు చేసింది.. రూ. 300 అంటే.. ఏ చిల్లర దొంగలో అనుకోకండా… ఎందుకంటే.. నిందితుల్లో ఒకరు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కాగా మరొకరు ప్రైవేట్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.. ఇంకొకరు మంచి కాలేజీలో చదువుకుంటున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ వద్ద రాత్రి సమయంలో లిఫ్ట్ కోసం విశాక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎదురుచూస్తున్నాడు.. అదే సమయంలో అటుగా కారులో వచ్చిన ముగ్గురు.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు..…
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పక్కా… వెనక్కి తగ్గేదేలేదని కుండబద్దలు కొట్టేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాసిన ఆయన.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా, కానీ, 3-4 రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారు.. అందుకే ఆగానని.. సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ…
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ నగర శివారులోని శంకర్ పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని హైకోర్టులో చిన్ని కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినందుకు.. తనపై కొందరు దాడికి యత్నించారని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో చిన్ని కృష్ణ శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్…
హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్…
రాజేంద్రనగర్ హైదర్ షా కోట్ కస్తూర్భా గాంధీ ఆశ్రమం నుండి 14 మంది మహిళలు పరారవడం సంచలనంగా మారింది. నిన్న అర్థరాత్రి 2 గంటల సమయంలో కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు మహిళలు. పేటా కేసులో మహిళలను ఆశ్రమానికి తరలించారు పోలీసులు. మహిళల పరారీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14…
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మెడికల్ లీవ్‌లోకి వెళ్తున్నారు.. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మెడికల్ లీవ్‌లో ఉండనున్నారు మహేందర్ రెడ్డి.. ఎడమ భుజానికి స్వల్ప గాయం, శస్త్రచికిత్స కారణంగా మెడికల్ లీవ్‌లోకి వెళ్లారు తెలంగాణ పోలీస్ బాస్.. దీంతో మహేందర్ రెడ్డి స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను అంజనీ కుమార్‌కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్ ఈమధ్యే బదిలీ అయ్యారు.. ఆయనను ఏసీబీ డీజీగా…