అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. కానీ.. మూడు కార్పొరేషన్ల ఛైర్మన్లు మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుని టికెట్ కోసం ట్రయిల్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గం కావడంతో అధికారపార్టీ నేతల ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కంటోన్మెంట్ టీఆర్ఎస్ రాజకీయాల్లో మలుపులు ఉంటాయా?గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఇక్కడ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్సే.…
హైదరాబాద్ శివారులో పేలుడు కలకలం సృష్టించింది.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్లో చెత్త కుండీలో పేలుడు సంభవించింది… ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్ నగర్లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనందనగర్ పారిశ్రామిక వాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు.. అయితే, చెత్త సేకరిస్తున్నండగా పేలుడు జరిగింది.. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..…
ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టెక్నాలజీల్లో బ్లాక్ చెయిన్, మెటావర్స్ టెక్నాలజీలు పటిష్టమైనవి. ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేస్తు హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ ఇండస్ట్రీ ఓ గేమ్‌ను క్రియోట్ చేసింది. ఈ గేమ్ లో హైలెవల్ కు వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను గెలుచుకోవచ్చని, ఈ టోకెన్లను క్రిప్టో ఎక్చేంజ్ ద్వారా సొమ్ము చేసుకోవచ్చని గేమ్ తయారీదారులు చెబుతున్నారు. హైదరాబాద్ స్టార్టప్ సంస్థ క్లింగ్ ట్రేడింగ్ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. ప్రస్తుతం బీటా వెర్షన్…
హైదరాబాద్ నగరంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టేందుకు ఆటోలతో ప్రమాదకర విన్యాసాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఆటోలతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఈ మేరకు ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని…
హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లపై హెచ్ఎండీఏ కీలక ప్రకటన చేసింది. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. బండ్లగూడ, నాగోల్‌లోని సహ భావన టౌన్షిప్ 15 టవర్‌లో మొత్తం 2246 ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపింది. వీటిలో చదరపు గజం కనీస ధర రూ. 2200 నుంచి రూ. 2700గా నిర్ణయించారు. అలాగే ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలజ టౌన్ షిప్ 8 టవర్‌లో ఏకంగా…
హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని దర్శించాలని భావించే భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలను ప్రకటించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమతామూర్తి కేంద్రానికి బుధవారం సెలవు ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులు సమతామూర్తిని దర్శించవచ్చని సూచించారు. మార్చి 9వ తేదీ నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి…
డబ్బులుంటే చాలు.. కాలేజీకి వెళ్లక్కర్లేదు. కష్టపడి పరీక్షలు రాయాల్సిన పనిలేదు. మీకే యూనివర్శిటీ సర్టిఫికెట్ కావాలంటే అది మీ ఇంటికే వచ్చి చేరుతుంది. తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం రచ్చరేపుతోంది. నకిలీ సర్తిఫికెట్లు సృష్టిస్తున్న వారితో పాటు నకిలి సర్టిఫికేట్లు కొన్నవారిని ..8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి భారి సంఖ్యలొ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సంతోష్ నగర్ కి చెందిన సయ్యద్ నవీద్ ఉరఫ్ ఫైసల్, యాదగిరి…
లా.. లా భీమ్లా.. అదరగొట్టు.. దంచికొట్టు.. ఒడిసిపట్టు.. నేడు హైదరాబాద్ మొత్తం వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్నా భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక నేడు ఈ సినిమా…
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందుతున్నది. ప్రజల ఆలోచనలు, కల్చర్ సైతం మారిపోతున్నది. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆలోచిస్తున్నారు. పైగా కరోనా తరువాత చాలా మార్పులు వచ్చాయి. కరోనాకు ముందు ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. కానీ, ఆ తరువాత మార్పులు వచ్చాయి. సినిమా థియేటర్లను పక్కన పెట్టి ఒటిటి ద్వారా సినిమాలు చూస్తున్నారు. అయితే, ప్రజల సౌకర్యార్థం నగరంలో డ్రైవ్ ఇన్ థియేటర్స్‌ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కార్లలోనే కూర్చొని…