* నేడు గుజరాత్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ, ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ * నేడు సీఎం జగన్ కర్నూలు పర్యటన, వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి కుమారుని పెళ్లి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ * తిరుపతి: నేడు ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళా.. నేటి నుంచి రెండు రోజుల పాటు జాబ్ మేళా, పాల్గొననున్న 137 కంపెనీలు, ఇప్పటి వరకు 1.34 లక్షల మంది రిజిస్ట్రేషన్ * నేడు…
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై మంనతాలు జరిపారు. అనంతరం ఆయన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల హైదరాబాద్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన బొజ్జల అనంతరం ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణ జన్మదినం. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న చంద్రబాబు ఈ సందర్భంగా బొజ్జల ఇంటికి వెళ్లి…
హనుమాన్ జయంతి విజయ యాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని బజరంగ్ దళ్, విహెచ్పీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం చారిత్రాత్మక గౌలిగూడ రాంమందిర్ నుండి నిర్వహించే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ ను నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహాన్, కార్తికేయ , జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, విశ్వ…
హైదరాబాద్‌లోని మందు బాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి… హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహించేందుకు భాగ్యనగరం సిద్ధమైంది.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రేపు గౌలిగూడ రాంమందిర్ నుండి తాడుబందు హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్స్, రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్…
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎంఎంటీఎస్.. కరోనా ఆంక్షలు, ప్రయాణికుల రద్దీ కూడా లేకపోవడంతో.. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా కొద్ద సర్వీసులను మాత్రమే నడుపుతూ వస్తున్నారు అధికారులు.. అయితే, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడానికి తోడు.. ప్రయాణికుల రద్దీ కూడా పెరగడంతో.. క్రమంగా సర్వీసులను పెంచుతూ వస్తున్నారు అధికారులు.. వర్క్ ఫ్రమ్ హోం ఎత్తివేసి.. ఐటీ సంస్థలు కూడా చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి…
వాహనదారులు త్వరపడండి… ఇవాళ్టితోనే పెండింగ్ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ల ఆఫర్ ముగిసిపోనుంది.. తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్.. మార్చి 31వ తేదీతో ముగిసే సమయంలో.. ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15వ తేదీ వరకు గడువు పెంచుతున్నామని హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించిన విషయం విదితమే.. అయితే, పొడిగించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.. అంటే, డిస్కౌంట్‌పై ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కు నేడే…
* ఐపీఎల్లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న కోల్‌కతా.. ముంబైలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * తిరుమలలో రెండో రోజు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. ఇవాళ స్వర్ణరథంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం * నేడు కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం.. కోదండరామస్వామికి పట్టా వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్ * ఇవాళ తిరుమలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటన.. శ్రీవారిని దర్శించుకోన్న గవర్నర్ * నేడు విశాఖకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ఈ…
ఆదమరిస్తే దొంగనోట్లతో బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. నెల్లూరు జిల్లా కావలి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు కావలి రూరల్ పోలీసులు. వారి వద్ద నుంచి లక్షా నలభై ఏడు వేల రూపాయలు 500 రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.నెల్లూరు జిల్లా కావలి, కావలి రూరల్ పరిసర ప్రాంతాల్లో కావలి పట్టణ ప్రాంతంలో దొంగనోట్ల చలామణి భారీగా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దొంగ నోట్లు బయటపడుతున్నాయి. కావలి అడిషనల్…
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. వివిధ అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మండిప్డడారు.. కేసీఆర్ అంత అవినీతి పాలన ఇప్పటి వరకు చూడలేదన్న ఆయన.. కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రజాశాంతి పార్టీ తరపున…
ఈ ఏడాది డిసెంబర్‌కి హైదరాబాద్‌లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి అవుతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… ట్యాంక్ బండ్ దగ్గర నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబేద్కర్ ఆదర్శం అన్నారు.. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మాణం అవుతుంది.. ఎనిమిది…