వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు తామే కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీ వేదికగా కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టిన తర్వాత రోజు.. కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. తామే వరి కొనుగోలు చేసేందుకు సిద్ధమై.. దానిపై ప్రకటన చేశారు.. ఇక, మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ఇవాళ వరి కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు…
దర్శక దిగ్గజం రాజమౌళి అర్ధరాత్రి చార్మినార్ లో సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనుకోకుండా ఆ సమయంలో, అలా రాజమౌళి కనిపించే సరికి జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రంజాన్ మాసం కావడంతో పాతబస్తీలో నైట్ బజార్ ప్రారంభమైంది. హైదరాబాదీలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు పాతబస్తీ, పరిసర ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలోని నైట్ బజార్ లో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కన్పించారు.…
తెలంగాణలో సంచలనం సృష్టించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి… పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు టోనీ ఎంజెంట్లు డ్రగ్స్ చేరవేసినట్టు ఆధారాలు లభించాయి.. టోనీ ఏజెంట్లు బాబు షేక్, నూర్ మమ్మద్.. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు డగ్ర్స్ సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.. దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని డ్రస్ దందా చేస్తున్నారు నైజీరియాకు చెందిన టోనీ.. ఇక, టోనీ ప్రధాన ఏజెంట్ ముంబై బాబు…
తెలంగాణలో ఆన్లైన్ యాప్ నిర్వాహకుల అరాచకాలు రోజుకు ఒకటి తరహాలో బయటపడుతూనే ఉన్నాయి.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు బలి అయ్యాడు.. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు తట్టుకోలేకు జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కుమార్ ఆన్లైన్ లోన్ యాప్ నుంచి రూ. 12 వేలు లోన్‌గా తీసుకున్నారు.. ఇప్పటికే ఈఎంఐ ద్వారా రూ.4 వేలు చెల్లించాడు.. అయితే, లోన్ తీసుకునే సమయంలో స్నేహితుల ఫోన్…
అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త అందింది. విద్యార్థి వీసా స్లాట్ల సంఖ్యను అమెరికా భారీగా పెంచింది. దీంతో పాటు వెయిటింగ్ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. ఇటీవల ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికా వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వెయిటింగ్ సమయాన్ని అమెరికా…
నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా తీసుకున్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం మాకు ఉందని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… హైదరాబాద్‌లో జరిగిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీల తోపాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించడంలో కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నుంచి మొదలుకొని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,…
రాష్ట్రానికి అవసరమైన యూరియా, డీఏపీ, ఎరువులు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎరువుల విభాగం ఉన్నతాధికారులు రాములు, ప్రధాన ఎరువుల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలానికి…
కరోనా థర్డ్ వేవ్ ముగిసి క్రమంగా తగ్గిపోయిన కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి.. మరోవైపు.. ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఆదివారం 1,150 కొత్త కేసులు నమోదై.. నలుగురు మాత్రమే మృతిచెందగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య భారీగా పెరిగి 2,183కు చేరింది.. మరో 214 మంది మృతిచెందారు. నిన్నటి కంటే 90 శాతం కేసులు అధికంగా నమోదు కావడం కలవరపెట్టే అంశం.. దేశ…
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా పరులు పెడుతూ పోయిన పెట్రో ధరలకు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి.. దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 65 పైసలుగా…
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాయలసీమ ముఠా హల్చల్ చేసింది. ఖరీదైన స్టలం ఆక్రమణకు ప్రయత్నించింది ముఠా. కర్నూల్ జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడిని నాయకత్వంలోని ముఠా ఈ అరాచకానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆదోనికి చెందిన 90మంది రౌడీలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 100 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆక్రమించేందుకు ముఠా ప్రయత్నించింది. వంద కోట్ల స్థలం ఆక్రమించేందుకు భూ మాఫియా పడగ విప్పింది. ఫ్యాక్షన్ సినిమా తలపించేలా కిరాయి రౌడీలు మారణాయుధాలతో నగరానికి వచ్చారు.…