KTR: హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ముందున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్‌లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ తన రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్ అతిపెద్ద సెంటర్ నగరంలో ఉన్నదని చెప్పారు. కాల్‌అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. కాల్‌అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
Also Read
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
తాజావార్తలు
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!