Hyderabad:రాత్రి 11 గంటల తరువాత పబ్బులు, మద్యం బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్ ఉన్న హోటల్‌కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్‌లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డ్రైవ్- ఇన్ రెస్టారెంట్స్ యజమానులకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హైదరాబాద్‌లో ఉన్న పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఇటీవల బంజారాహిల్స్‌లో పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో తనిఖీలు చేసిన పోలీసులకు కొకైన్ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదని, దీంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొని పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్ మారిందని తెలిపారు. ఇలాంటి సమయంలో.. కొంత మంది బార్లు, పబ్బుల యజమానులు చిన్న చిన్న లాభాల కోసం నిబంధనలు అతిక్రమిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పబ్బులు, బార్ల నుంచి వెలువడే ధ్వనులు పరిమితి స్థాయి కంటే అధికంగా ఉండటం, పబ్బులకు వచ్చిపోయే వారి వాహనాలతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, మద్యం మత్తులో బయటకు వచ్చిన కొందరు రహదారులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలపై ఆయా ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాలకు సంబంధించిన బ్యాకప్ 30 రోజులు తప్పని సరిగా ఉండాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి,చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
రాత్రి 11 గంటల తరువాత వచ్చే ఆర్డర్లను అనుతించవద్దని, 12 గంటల లోపు తమ సంస్థలను మూసేయాలని సీపీ సూచించారు. వీకెండ్స్ (శుక్ర, శని వారాల) దృష్ట్యా అరగంట గ్రేస్ పీరియడ్‌తో పాటు అదనంగా ఒక గంట మినహాయింపు ఉంటుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందే లైట్లను డిమ్ చేస్తారని, తద్వారా కస్టమర్లకు పబ్బు మూసేసే సమయం అయ్యిందని తెలిసిపోతున్నదన్నారు. నగరంలో కూడా ఈ పద్ధతిని పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ వీఆర్.శ్రీనివాస్, జాయింట్ సీపీలు రమేశ్, విశ్వప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..
- Tags
- alcohol
- Bars
- hyderabad
- pubs
- Restaurants
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!