హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ అందించారు. శ్రీరామనవమి వేడుకల కారణంగా రెండు రోజుల పాటు నగరంలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్…
* నేడు అవిశ్వాస తీర్మానంపై పాక్ నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న ఇమ్రాన్‌ఖాన్ * తిరుమలలో నేటి నుంచి వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు పునరుద్ధరణ * దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ రేపటి నుంచి బూస్టర్ డోస్ * నేటి నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. 10 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు * మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతోన్న సీఎం వైఎస్ జగన్ కసరత్తు.. ఇవాళ మరోసారి సజ్జలతో భేటీ అయ్యే…
శ్రీరామ నవమి వచ్చేస్తోంది… అయితే, ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్రపై అంశం హైకోర్టుకు చేరింది… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ మధ్య చోటుచేసుకున్న కొన్ని ఘటన నేపథ్యంలో.. భైంసాలో శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, హైకోర్టు మెట్లెక్కింది హిందూ వాహిని సంస్థ.. ఇక, కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతివ్వకపోవడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. భైంసాలో శ్రీరామనవమి…
ఈ మధ్యే చిల్లర కష్టాలకు చెక్‌పెడుతూ.. చార్జీల రౌండప్ పేరుతో భారీగా వడ్డించిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు మరోసారి ప్రయాణికులకు షాక్ ఇస్తూ మళ్లీ చార్జీలను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో అదనంగా ప్రయాణికులపై భారం వేసింది.. ఇక నుంచి బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ.. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ. 2 చొప్పున చార్జీలు పెరగనుండగా.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ. 5…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.. ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.. ఇక, వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్…
హైదరాబాద్ తుకారాంగేట్ పరిధిలో మహిళా క్రికెటర్ భోగి శ్రావణి నివసిస్తున్న ఇంటిని శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారని.. దీంతో తాము ఇంటిని మరమ్మతులు చేయించినట్లు క్రికెటర్ శ్రావణి వెల్లడించింది. అయినా తమ ఇంటిని అధికారులు పరిశీలించకుండా కూల్చివేశారని ఆమె ఆరోపించింది. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని వాపోయింది. అయితే ఈ ఘటనలో డిప్యూటీ స్పీకర్…
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోందా? డ్రగ్స్ తీసుకున్నవారికి నోటీసులు జారీ కానున్నాయా? అంటే అవునంటున్నారు పోలీసులు. పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. 20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా లభ్యమైన ఆధారాలతో దర్యాప్తులో ముందడుగు పడిందంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న…
దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొని ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఆర్గనైజర్లను, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బుకీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.06 కోట్ల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 7 ల్యాప్ టాప్‌లు,…
హైదరాబాద్‌లో ఎంఐఎం కార్పొరేటర్లు హల్ చల్ చేస్తున్నారు.. భోలక్‌పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే… ఓల్డ్ సిటీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. చార్మినార్ యునాని ఆసుపత్రి ముందు నో పార్కింగ్ ఏరియాలో.. తన వాహనాన్ని పార్క్ చేశాడు. మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో.. వెహికల్స్ పార్కింగ్ కోసం యునాని హాస్పిటల్ గేట్లు తెరిపించాడు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి.. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు.. డయల్…