తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇవాళ ఉదయం రాజభవన్లో గవర్నర్ తమిళ సైతో సమావేశం కానున్నారు. దానికి ముందు… కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ వద్ద సమావేశమై గవర్నర్ కార్యాలయానికి బయలుదేరుతారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందం గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరనుంది కాంగ్రెస్ పార్టీ. Read Also: Ukraine…
* ఐపీఎల్లో నేడు ముంబైతో తలపడనున్న పంజాబ్.. పుణె వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49 వేలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,450, కిలో వెండి ధర రూ.72,700 * నేడు అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు. * ఏపీ: కృష్ణా జిల్లాలో గవర్నర్ బిశ్వభూషణ్ పర్యటన.. పెనమలూకు నియోజకవర్గం…
తెలంగాణలో తమ వాహనాలపై పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్ ముగియవచ్చింది.. ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్‌కు ఇక మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న చలాన్లకు ఇచ్చిన డిస్కౌంట్ క్లియర్ చేసే సమయం 15-4-2022 సాయంత్రంతో ముగుస్తుంది. ఇకపై…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం…
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మనోహర్ 35, మాథ్యూ వేడ్ 19 పరుగులు చేశారు. సన్ రైజర్స్…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు…
* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం… ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ.. వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ * భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు గవర్నర్ తమిళిసై పర్యటన.. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్లను కలవనున్న గవర్నర్, 3 గంటల పాటు గ్రామంలోని గిరిజనులతో గడపనున్న గవర్నర్ * నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం,…
* నేడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ వర్చువల్ భేటీ, కోవిడ్, ఇండో-పసిఫిక్, క్వాడ్, ద్వైపాక్షిక అంశాలపై చర్చ * ఐపీఎల్లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం.. రేపటి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీని పునఃప్రారంభించనున్న టీటీడీ * నేడు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణం చేయించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ *…
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో శ్రీరామనవమి వేడుకల్లో శోభకనిపిస్తోంది. వాడవాడలా శ్రీరాముడి కల్యాణం ఘనంగ నిర్వహించారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే శోభాయాత్ర గుర్తుకువస్తుంది. సీతారాం బాగ్ నుండి మొదలైంది శోభాయాత్ర. ఆరున్నర కిలో మీటర్లు కొనసాగనుంది శోభాయాత్ర. టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో నవమి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంబాగ్…