కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్‌లో పడి 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంప్‌లో పడి ప్రాణాలు విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గమనించడంతో అప్పటికే బాలుడు మృత్యు వాత పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..
ఒడిశా రాష్ట్రానికి చెందిన అమర్ దాస్, ఎమిన్ దాస్ దంపతులు గత పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. నగర శివారు గుండ్లపోచంపల్లిలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటూ రోజువారి కూలీ పనులు చేసుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. భార్య ఎమిన్ దాస్ రోజువారి పనుల్లో భాగంగా ఉదయం పనికి వెళ్లింది. తన భర్త అమర్ దాస్ .. ఇంట్లో తన పదేళ్ల పెద్దకొడుకుతో పాటు కృష్ణదాస్ (2) తో కలిసి ఉన్నారు. పెద్దకొడుకుకు జ్వరం రాగా ఇంట్లో పడుకొని ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో అమర్ దాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చిన్న కొడుకు కృష్ణదాస్ ఆడుకుంటూ ఇంటి ముందు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తండ్రి అమర్ దాస్ సంపులో తేలిన కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించడంతో స్థానికులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి కుట్టి అనే మూడేళ్ళ బాలిక మృతి చెందింది. నీటి సంపుకు ఉన్న మూత తెరిచి ఉండటంతో ఈప్రమాదం జరిగింది. ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతా వెతికారు. కానీ.. బాలిక కనిపించలేదు.. చివరికి నీటి సంపులో తేలుతూ కనిపించిడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతదేహాన్ని గుండెకు హత్తుకుని బోరున ఏడ్చారు.
పొట్ట చేత పట్టుకొని జగదీష్ కుటుంబం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుండి హైదరాబాద్ వచ్చింది. భవన నిర్మాణ కార్మికులుగా బాలిక తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. అప్పటి వరకు ఎదురుగా తన కళ్లముందు ఆడుకుంటూ వున్న చిన్నారి శవమై తేలడంతో తల్లిండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు.. తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు చేస్తూనే ఉన్నారు.. కానీ నిర్లక్యంగా వ్యవహరించి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు.. కృష్ణదాస్, చిన్నారి కుట్టి మృతితో ఒక్కసారిగా వారి కుంటుంబాల్లో విషాధ ఛాయలు అలుము కున్నాయి.
Mahesh Babu: సర్కారు వారి పాట సినిమాలో ‘భీమ్లా నాయక్’