హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం ఘటన కొత్త మలుపు తిరిగింది. సాహెబ్‌నగర్ బ్రాంచీలో క్యాషియర్ రూ. 22 లక్షల 53వేల 378 లక్షల నగదుతో పరారైనట్లు… బ్యాంకు అధికారులు మంగళవారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలపై సెల్ఫీ వీడియో ద్వారా క్యాషియర్ ప్రవీణ్ వివరణ ఇచ్చాడు.
హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రవీణ్.. ప్రస్తుతం పోలీసు కేసులో నిందితుడిగా ఉన్నాడని.. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ప్రవీణ్ ఓ సెల్ఫీ వీడియో పంపించారు. తాను డబ్బులు తీసుకెళ్లలేదని.. బ్యాంకు సిబ్బంది అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీడియోలో వెల్లడించారు. బ్యాంకు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని ప్రవీణ్ ఆరోపించారు. గత 2 నెలలుగా అకౌంట్స్‌లో నగదు తక్కువగా వస్తున్నట్లు గుర్తించానని వీడియోలో ప్రవీణ్ చెప్పారు. ఈ విషయం మేనేజర్‌కు చెప్పనా పట్టించుకోలేదని… ఆయన నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థతి తలెత్తిందని ప్రవీణ్ అన్నారు.
వాళ్లే తీసి, నేరం నాపై మోపుతున్నారు..
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కడుపునొప్పి రావడంతో.. ఇంటికి వెళ్తున్నానని చెప్పి బ్యాంకు నుంచి బయటికి వచ్చానని…. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని ప్రవీణ్ తెలిపారు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది కలిసి సేఫ్ లాకర్లో నగదు తీసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను బ్యాంకులో నుంచి బయటకు వెళ్లిన సమయంలో సీసీ కెమెరాలతో పాటు… సేఫ్ లాకర్లో బీరువాకు ఉండే సీసీ కెమెరాలను పరిశీలిస్తే అసలు విషయం తేలిపోతుందని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
“లావాదేవీల్లో తగ్గిన నగదును నాపై పడేస్తున్నారు. గత 2 నెలలుగా నగదు తక్కువ వస్తోందని మేనేజర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. మేనేజర్ వినయ్‌కుమార్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. అనవసరంగా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను బ్యాంకులో నుంచి వెళ్లిన సమయంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తే అసలు నిజం తెలిసిపోతుంది.” -సెల్ఫీ వీడియోలో ప్రవీణ్
బ్యాంకు నుంచి క్యాషియర్ ప్రవీణ్ రూ. 22 లక్షల 53వేల 378 లక్షలు ఎత్తుకెళ్లాడని బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు మంగళవారం (మే 10) రాత్రి వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రవీణ్ తల్లిని ప్రశ్నించారు. క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోయాయని తల్లి చరవాణికి సందేశం పెట్టి.. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత 2 రోజులుగా ప్రవీణ్ కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపించారు. అతని కోసం వనస్థలిపురం పోలీసులు గాలిస్తున్నారని గమనించిన ప్రవీణ్.. సెల్ఫీ వీడియో పంపించాడు.
విచారణకు ప్రవీణ్ సహకరిస్తే.. పూర్తి వివరాలు తెలుస్తాయి- ఏసీపీ పురుషోత్తంరెడ్డి
‘వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 22 లక్షల 53వేల 378 లక్షలు మాయమవడంతో క్యాషియర్ ప్రవీణ్‌పై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారి కుటుంబీకులను విచారించాం. ప్రవీణ్‌కు ఆన్లైన్ గేమ్స్ ఆడే అలవాటున్నట్లు దర్యాప్తు తేలింది. అందులో డబ్బు పోగొట్టుకున్నాడని తెలిసింది. అతని కోసం గాలిస్తుండగా ఈ క్రమంలో ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపించాడు. తాను తీయలేదని చెబుతున్నాడు. విచారణలో ప్రవీణ్ మాకు సహకరిస్తే.. పూర్తి వివరాలు తెలుస్తాయి. అని ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.
రోజులు మారుతున్న కొద్దీ.. బ్యాంక్ వ్యవహారం కేసు కొత్త కోణంలో వివరాలు బయటకు వస్తున్నాయి. నిన్న మేసేజ్ చేశాడని, ఈరోజు వీడియో అంటూ వస్తున్న సమాచారంతో సర్వత్రా ఉత్కఠంగా మారుతోంది. మరి దీనిపై పోలీసుకుల ప్రవీణ్ సహరిస్తాడా? అంటూ స్థానికుల్లో ప్రశ్నలు మొదలవుతున్నాయి. అసలు బ్యాంకులో ఏంజరిగిందో ప్రవీణ్ పోలీసులకు వివరిస్తే గాని ఈఉత్కంఠతకు తెరవెనుక జరిగిన అసలు కథ బయటకురాదు.
https://www.youtube.com/watch?v=W5vHL2xssAgJC Prabhakar Reddy: ముసలోడు అయినా చంద్రబాబే మేలంటున్నారు