బీజేపీకి రాజీనామా చేసి మంత్రి సబితా రెడ్డి సమక్షంలో బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ ను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో పెద్ద ఎత్తున అనుచరులతో టి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ సర్పంచ్ ను టి ఆర్ ఎస్ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే తెలంగాణా అభివృద్ధి సాధ్యమని నమ్మి టి ఆర్ ఎస్ పార్టీలో చేరటానికి ముందుకు వస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.
దేశాన్ని అధోగతి పాలు చేస్తూన్న మోడీ ప్రభుత్వం ఒక వైపు, తెలంగాణ లో సుపరిపాలన అందిస్తూ దేశానికే గర్వకారణంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మరోవైపని టీఆర్ ఎస్ పార్టీలో చేరిన సర్పంచ్ అనిత శ్రీనివాస్ ,వార్డు సభ్యులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అన్నారు. ఇంత మంచి పాలన అందిస్తున్న తెలంగాణా సర్కార్ పై విషం చిమ్మటానికి వస్తున్న అమిత్ షా కి ఇక్కడ స్థానం లేదని మండిపడ్డారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టిఆర్ఎస్. కె .. మా మద్దతు అని అన్నారు. గుజరాత్ గులాముల పార్టీ బీజేపీకి రాజినామ చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీ కండువాకప్పుకోవడం ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు జయేందర్ ,సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ ,నాయకులు సురేందర్ రెడ్డి ,లక్ష్మి నరసింహ్మ రెడ్డి ,దామోదర్ , పాండు గౌడ్ ,విగ్నేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
NEET Exam: నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం