Saddula Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.. ఇక, సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ.. అతిపెద్ద బతుకమ్మగా గిన్నీస్ రికార్డుల కెక్కింది. మరోవైపు, ఇవాళ జరగనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. కాగా, దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన…
ఆసియాకప్ 2025 ఫైనల్స్ లో భారత్ -పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. టైటిల్ పోరులో భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించి విజయం సాధించింది. భారత్ విజయంలో తిలక్ వర్మ వీరోచిత పోరాటం మరువలేనిది. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు. Also Read:Pawan Kalyan :…
తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు.. అతడే తిలక్ వర్మ. ప్రపంచమంతా ఈ పేరే మార్మోగుతోంది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన తిలక్‌వర్మ.. ఆసియా కప్ భారత్ వశం అయ్యేలా చేశాడు. తిలక్ వర్మ.. మా హైదరాబాదీ అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్. Also Read:Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్ ఎగ్జామినేషన్…
Chiranjeevi :బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించకుండానే వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, చిరంజీవి కేవలం “నేను చెప్పాల్సింది చెప్పాను” అంటూ ముందుకు కదిలారు. నిజానికి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మొన్ననే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ ద్వారానే తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని…
Movie Piracy: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ పైరసీ రాయుళ్ల విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల పైరసీపై లోతైన దర్యాప్తు చేసి దేశంలోనే తొలిసారిగా ఒక పైరసీ ముఠాను పట్టుకున్నామని తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతోందని సీపీ వివరించారు. 2023లో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు రూ.22,400…
Indira Canteen: హైదరాబాద్‌లోని పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిరా క్యాంటీన్’ (Indira Canteen)పథకాన్ని ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఈ పథకం ద్వారా కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మోతీనగర్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కూడా పాల్గొన్నారు. Accenture Layoffs: అసలేం జరుగుతోంది..…
Sohani Kumari: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ నటి అయిన సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన సోహాని కుమారి, సవాయ్ సింగ్‌లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి, గత జూలైలో ఇరువురికీ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్…
Movie Piracy: హైదరాబాద్ నగరంలో విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ మూవీ పైరసీ రింగ్‌ను పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మీడియా ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేయడమే కాకుండా.. వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలను రహస్యంగా రికార్డ్…
CM Revanth Reddy: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో.. లోతట్టు ప్రాంతాల వారు.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. లోతట్టు…