HYDRA : బోడుప్పల్‌లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అకస్మిక పరిశీలన నిర్వహించారు. చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు ఇళ్లపై నెంబర్లు వేశారు, ఇనుప కడ్డీలు పెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురిచేశారంటూ స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా FTL పేరుతో తమపై ఒత్తిడి తేవడం అన్యాయం అని వారు వేదన వ్యక్తం చేశారు.
స్థితిగతులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇళ్లపై చేసిన మార్కింగులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మార్కింగ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేస్తామని స్పష్టంగా తెలిపారు. పాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం చెరువు హద్దులు మార్చబోమని, 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోదని కమిషనర్ స్థానికులకు హామీ ఇచ్చారు.
హైడ్రా పేరిట ఎవరైనా వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్లపై జరిగిన మార్కింగులను వెంటనే తొలగించాలని ఆదేశించగా, HMDA అధికారులు వెంటనే వాటిని తొలగించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకొని కమిషనర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. చెరువు అభివృద్ధి, బాక్స్ డ్రెయిన్ పనులను శీఘ్రం చేయాలని కూడా కమిషనర్ సిఫార్సు చేశారు. స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కారం చూపడంలో కమిషనర్ చర్యలు ప్రశంసనీయంగా నిలిచాయి.
Deputy CM Pawan: ఎర్ర చందనం తాకితే తాట తీస్తాం: స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ మాస్ వార్నింగ్