తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. కుండపోత వర్షం పలు కుటుంబాల్లో విషాధాన్ని నింపింది. ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం (మం) చల్పాక గ్రామంలో లో పిడుగు పడి ఊకె కృష్ణ కృష్ణ అనే రైతు మృతి చెందాడు. చిట్టిబాబు అనే మరో రైతుకు గాయాలు అయ్యాయి. పంట పొలంలో పనులకు వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా,…
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని పోలీసులు చేధించారు. యాకుత్ పూరా కు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. టౌలీ చౌకీ కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్ గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను బలవంతంగా ఆటో లో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్…
హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఫిలింనగర్లో ప్రాంతాలలో వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.…
హైదరాబాద్‌లో జరుగుతున్న ఓజీ కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వర్షంలో కూడా తడుస్తూ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో కనిపించారు. సింగిల్‌గా నడుస్తూ వచ్చిన ఆయన సింపుల్‌గా అలా వచ్చి స్టేజి మీద కూర్చుండడంతో, ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయారు. ఒకపక్క తమన్ అండ్ టీం లైవ్ సాంగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. దానికి…
లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని…
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్‌లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో…
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. లక్ష రూపాయలకు మించిపోయి చుక్కలు చూపిస్తోంది. దీంతో విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారాన్ని అక్రమంగా తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించేందుకు కొంత మంది కేటుగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఎయిర్ పోర్టులో దిగీదిగగానే.. DRI అధికారులను చూసి బంగారాన్ని వదిలేసి వెళ్లారు. తర్వాత ఆయా వ్యక్తులను DRI అధికారులు అరెస్ట్ చేశారు. నిత్యం ధర పెరుగుతున్న పసిడి ఇప్పుడు లాభసాటి వ్యాపారం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే.. సౌదీ అరేబియా,…
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన రూ. 4000 కోట్ల లిక్కర్ స్కాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ భారీ దాడులు నిర్వహించింది. పీఎంఎల్ఏ చట్టం, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఆంధ్రప్రదేశ్‌లోని 20 ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. Also Read:Vikarabad : వికారాబాద్ పూడూర్లో పనిమనిషిని మోసగించి భూమి కాజేసిన యజమానులు స్కాం వివరాలు ఏపీ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019…
Chitti Scam: జనాల అమాయకత్వమే వారికి పెట్టుబడి. దాన్ని ఆసరాగా చేసుకుని చిట్టీల వ్యాపారం పేరుతో అందిన కాడికి దండుకుని బిచాణా ఎత్తేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు. అలాంటి ఘటనే హైదరాబాద్ శంషాబాద్‌లో జరిగింది. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు కొట్టేశారు దంపతులు. వారి దగ్గర నమ్మి చిట్టీలు వేసిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇలాగే ప్రచారం చేస్తారు కొంత మంది. డబ్బులు తీసుకుంటారు.. చిట్టీలు నడిపిస్తారు. వన్ ఫైన్ మార్నింగ్.. ఆ డబ్బులతో ఉడాయిస్తారు.…